ఎన్టీఆర్‌తో చిరంజీవి ‘చుట్టరికం’
ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రధాన పోటీ నందమూరి, మెగాస్టార్ కుటంబీకులకు చెందిన నటుల మధ్యే. పైకి ఈ రెండు వర్గాలు కలిసి మెలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా తెరపై మాత్రం ఆధిపథ్యం కోసం నిత్యం పోరాడుతూనే ఉంటారు. వీళ్ల అభిమానులైతే ముఖాముఖి తలపడిన సందర్భాలు అనేకం. తెలుగు సినీ ప్రేక్షఃకులు విస్తుపోయేలా ఒకరి హీరోపై మరొకరు వ్యంగాస్త్రాలతో ఇంటర్నెట్ యుద్దం జరిగిన విషయమూ తెలిసిందే.
అయితే ఈ రెండు ప్రత్యర్థి వర్గాలు ఒక్కటి కాబోతున్నాయా? అంటే అవుననే సూచనలు స్పష్టంగా కనిపిస్తన్నాయి. నందమూరి, చిరంజీవి కుటుంబాల మధ్య త్వరలో బంధుత్వం కలవబోతుండటమే ఇందుకు కారణం. రామ్ చరణ్ పెళ్లి చేసుకోబోతున్న ఉపాసన కామినేని తాతయ్య సూర్య నారాయణ రావు.... సీనియర్ ఎన్టీఆర్ కు దగ్గరి బంధువు. రామ్ చరణ్ పెళ్లి ద్వారా నందమూరి-మెగాస్టార్ కుటుంబాలు ఒక్కటి కాబోతుండటంపై ఇటు ఫ్యాన్స్‌లోనూ ఆనందం నెలకొంది.
గతంలో మంచు విష్ణు పెళ్లి ద్వారా...వైఎస్ఆర్-మంచు కుటుంబాలు ఒక్కటైనట్లు, ఇప్పడు రామ్ చరణ్ పెళ్లి ద్వారా నందమూరి-మెగాస్టార్ కుటుంబాలు ఒక్కటి కాబోతున్నాయన్నమాట.


Click it and Unblock the Notifications











