Don't Miss!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రత్తాలు లవ్యూ టూ అంటూ: చిరంజీవి వీడియో సందేశం
Recommended Video
లక్ష్మీ రాయ్ లేటెస్ట్ మూవీ 'జూలీ-2' శుక్రవారం ( అక్టోబర్ 24) ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 ఏళ్ల క్రితం విడుదలై సంచలనం రేపిన 'జూలీ' సినిమాకు సీక్వెల్ గా ఈ జూలీ పార్ట్ టూ వస్తోంది. అప్పట్లో నేహాదూపియా ఆ సినిమాతో సంచలనం రేపింది. ఇప్పుడు 'జూలీ-2'లో లక్ష్మీ రాయ్ టైటిల్ పాత్రను పోషిస్తోంది. శుక్రవారం విడుదలకానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వినూత్న పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి
ఇందులో భాగంగా లక్ష్మీరాయ్‌కి, ‘జూలీ-2' చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి వీడియోలో బెస్ట్ విషెస్ తెలిపాడు అసలు మామూలుగానే తన పని తాను చేసుకుపోయే మెగాస్టార్ పర్సనల్ గా హెల్ప్ చేయటం లాంటివి తప్ప పెద్దగా ఇతరుల సినిమాలకి ప్రచారం చేసేలాంటి పని పెట్టుకోడు.
మెగాస్టార్
ఒక రకంగా ఈ జోక్యం చేసుకోని తనమే మెగాస్టార్‌ని ఇండస్ట్రీ లో వివాదరహితుడిగా ఉంచింది. కానీ ఇన్నాళ్ళకి రాయ్ లక్ష్మికి మాత్రం ఆ లక్ చిక్కింది. ఏకంగా ఒక వీడియో సందేశమే పంపాడు చిరు... ఇక రాయ్ లక్ష్మి ఆనందం ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా...
హాయ్ రాయ్ లక్ష్మీ
వీడియోలో మాట్లాడిన చిరంజీవి రాయ్ లక్ష్మికీ, జూలీ 2 టీమ్కీ శుభాకాంక్షలు చెప్పాడు. ‘హాయ్ రాయ్ లక్ష్మీ. బాలీవుడ్లో నీ మొదటి సినిమా విడుదలకానున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా నీకు చాలా ప్రత్యేకమైనదని తెలుసు. నీ సినిమా కెరియర్లో ఇది 50వ చిత్రం.
గుడ్ లక్ టు జూలీ 2
నీలో ఉన్న టాలెంట్‌ని, నీలో దాగిఉన్న శక్తిని ఈ సినిమా బయటపెడుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. జూలీ 2 విడుదల సందర్భంగా మరొక్కసారి నీకు శుభాకాంక్షలు. గుడ్ లక్ టు జూలీ 2. లవ్ యు టు..'' అన్నారు.
|
ఓ మై గాడ్
చిరు నుండి ఈ శుభాకాంక్షలు అందుకున్న రాయ్ లక్ష్మీ ఆనందంతోనిండిన ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ట్వీట్ చేసింది. "ఓ మై గాడ్, నిజంగా మీ దీవెనలు నా హృదయాన్ని హత్తుకున్నాయి. ఇది నా జీవితంలోనే గొప్ప బహుమతిగా భావిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు చిరంజీవి గారూ.., మీ దీవెనలను గౌరవంగా స్వీకరిస్తున్నా. మీరిచ్చిన ఈ ఉత్సాహంతో మీ రత్తాలు సర్ప్రైజ్ అయింది. లవ్ యు..సార్"అంటూ తెగ మురిసిపోతూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.