Bholaa Shankar అనిల్ సుంకరకు బిగ్ రిలీఫ్.. డిస్టిబ్యూటర్‌కు షాక్..భోళా శంకర్ కేసులో కోర్టు బిగ్ ట్విస్ట్
భోళా శంకర్ సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ డిస్టిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సూర్యనారాయణ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దాంతో నిర్మాత అనిల్ సుంకరకు భారీ ఊరట చేకూరింది. దాంతో భోళా శంకర్ రిలీజ్‌కు మార్గం సుగమమైంది. ఏజెంట్ సినిమా డిస్టిబ్యూషన్ హక్కుల విషయంలో తనకు అన్యాయం జరిగింది.
ఆ సమయంలో తాను రూపొందించే తదుపరి రెండు సినిమాలు తమకే ఇస్తారని చేసుకొన్న ఒప్పందాన్ని అనిల్ సుంకర విస్మరించారు. కాబట్టి భోళా శంకర్ హక్కులు మాకే ఇవ్వాలి. అలాగే ఈ వివాదం పరిష్కరించే వరకు భోళా శంకర్ రిలీజ్‌ను నిలిపి వేయాలని కోర్టును ఆశ్రయించడంతో వివాదంగా మారింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

బత్తుల సత్యనారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ కోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం.. ఏజెంట్ మూవీ డిస్ట్రిబ్యూషన్ కోసం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం 30 కోట్ల రూపాయలు చెల్లించాను. ఈ మేరకు నా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ గాయత్రి దేవి ఫిలింస్‌తో అనిల్ సుంకర అగ్రిమెంట్ కూడా చేసుకొన్నారు. దాంతో నేను నా మిత్రులతో కలిసి 30 కోట్లు వైట్ మనీ రూపంలో థియేట్రికల్ రైట్స్ కోసం బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించాను. కానీ రిలీజ్ సమయంలో కేవలం మాకు వైజాగ్ జిల్లా రైట్స్ మాత్రమే ఇచ్చి అగ్రిమెంట్‌కు తూట్లు పొడిచారు అని సతీష్ ఆరోపించారు.
మా ఒప్పంద ప్రకారం ప్రస్తుతం భోళా శంకర్ సినిమా హక్కులు మాకే చెందాలి. ఈ విషయంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌తో జరిపిన చర్చలు సఫలం కాలేదు. 24 రోజుల్లో డబ్బు తిరిగి ఇస్తామని చెప్పి మాట తప్పారు. నాకు అన్యాయం జరగిందని భావించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్లడం జరిగింది. గతంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌తో చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎప్పుడూ ఇలాంటి సమస్యలు, మోసాలు జరగలేదు అని సతీష్ తన ప్రకటనలో తెలిపారు.
ఏజెంట్ సినిమాకు సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోపాటు నాపై ఫోర్జరీ చేశాననే నింద, ఆరోపణలు చేశారు. డబ్బులు ఎగొట్టాలనే ప్రయత్నం వారిలో నాకు కనిపిస్తున్నది. గతంలో యూరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో వారిపై ఆ సంస్థ కేసులు పెట్టింది. మాకు న్యాయం జరగకపోతే అనిల్ సుంకరపై, వారి సంస్థపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని వైజాగ్ సతీష్ ఓ ప్రకటనలో తెలిపారు.
భోళా శంకర్ సినిమా రిలీజ్ నిలిపివేయాలంటూ బత్తుల సత్యనారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ కోర్టు కోర్టుకు వెళ్లడంతో మూవీ రిలీజ్ అవుతుందా? లేదా అనే విషయం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆగస్టు 11వ తేదీన రిలీజ్ ఉండటంతో ఈ సినిమా వివాదంపై కోర్టు గురువారం ప్రత్యేకంగా ఇరు వర్గాల వాదనలు విన్నారు. చివరకు బత్తుల సత్యనారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ కోర్టు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసి పుచ్చింది. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది.
భోళా శంకర్ సినిమా రిలీజ్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనిల్ సుంకరకు భారీ ఊరట లభించింది. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకొన్న వైజాగ్ సతీష్‌కు కోర్టులో చుక్కెదురైంది. అయితే ఈ వ్యవహారంపై బత్తుల సత్యనారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











