»   » పాతికేళ్ల కింద బచ్చన్ కూడా చిరు కంటే బచ్చానే! (ఫోటో సాక్ష్యం ఇదే)

పాతికేళ్ల కింద బచ్చన్ కూడా చిరు కంటే బచ్చానే! (ఫోటో సాక్ష్యం ఇదే)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు చిత్ర సీమను రారాజుగా ఏలిన స్టార్స్ ఎవరంటే.... బాక్ అండ్ వైట్ కాలంలో ఎన్టీఆర్, ఆ తర్వాత జనరేషన్లో మెగాస్టార్ చిరంజీవి అని ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. అయితే చిరంజీవి టాలీవుడ్లో మెగాస్టార్‌గా చిరంజీవి వెలిగిపోతున్న సమయంలో బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ టాప్ రేంజిలో కొనసాగుతున్నాడు.

అయితే ఆ రోజుల్లో అమితాబ్ బచ్చన్ కంటే చిరంజీవే రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకున్నాడట. అంటే ఒకానొక సందర్భంలో ఇండియాలోని అందరి స్టార్ల కంటే చిరంజీవి అత్యదిక రెమ్యూనరేషన్ అందుకున్నారు. అప్పట్లో ఈ విషయాన్ని కొన్ని పత్రికలు, మేగజైన్లు ప్రముఖంగా ప్రచురించాయి. పరిశ్రమ పరంగా అప్పట్లో హిందీ చిత్ర సీమనే పెద్దది. అక్కడ పాపులారిటీ పరంగా బచ్చన్ పెద్ద స్టార్. అలాంటి రోజుల్లో తెలుగు స్టార్ చిరంజీవి బచ్చన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం విశేషమే మరి.

1992లో 'వీక్' అనే మేగజైన్ తన కవర్ పేజీపై చిరంజీవి బొమ్మతో 'బిగ్గర్ దన్ బచ్చన్' అంటూ చిరంజీవి 1.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు రాసింది. అప్పట్లో చిరంజీవి సినిమాలకు ఎంత క్రేజ్ ఉండేదో, కలెక్షన్లు ఎలా ఉండేవో ఈ ఒక్క ఉదాహరణ చాలు అంటున్నారు ఫ్యాన్స్.

అప్పట్లో గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి మాస్ హిట్ల తర్వాత కళా తపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చేయాలనుకున్నారు. ఏడిద నాగేశ్వరరావు అనే నిర్మాత పూర్ణా క్రియేషన్స్ బేనర్లో ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. చిరంజీవి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని రూ. 1.25 రెమ్యూనరేషన్ ఆఫర్ చేసారు. ఆ సినిమా మరేదో కాదు 'ఆపద్భాంధవుడు'. 1992 అక్టోబర్ 9న ఈ సినిమా రిలీజైంది. అప్పటికి బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ రెమ్యూనరేషన్ రూ. 1 కోటి మాత్రమే.

తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి ఒక ట్రెండ్ సెట్టర్ అని అంటుంటారు సినీ విశ్లేషకులు. చిరంజీవి సినిమాల్లో కొన్ని సార్లు కథ, కథనం మామూలుగా ఉన్న కేవలం ఆయన చేసే డాన్సులు, పైట్లు చూడటానికే థియేటర్లు జనాలు వెళ్లే వారంటే ఆయనకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

వీక్ మేగజైన్

వీక్ మేగజైన్

1992 సెప్టెంబర్ మాసంలో ‘వీక్' అనే మేగజైన్ కవర్ పేజీ చూస్తే మీకు అసలు విషయం అర్తం అవుతుంది. ఇపుడు ఫ్యాన్స్ సర్కిల్ లో ఈ ఫోటో తెగ సర్క్యూలేట్ అవుతోంది.

చిరంజీవి బాక్సాఫీసు కింగ్

చిరంజీవి బాక్సాఫీసు కింగ్

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ జనరేషన్ తర్వాత బాక్సాఫీసు కింగుగా చిరంజీవి వెలుగొందారు. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి మాస్ మూవీలతో పాటు పలు క్లాస్ సినిమాల్లో నటించి మెప్పించారు.

మకుటం లేని రారాజు

మకుటం లేని రారాజు

టాలీవుడ్లో చిరంజీవి ఒకానొక సందర్బంలో మహారాజుగా పరిశ్రమను శాసించారని చెబుతుంటారు.

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

తెలుగులో ఒకప్పుడు నలుగు అగ్రహీరోలు ఉండేవారు. వారిలో చిరంజీవి టాప్. అందుకు కారణం చిరంజీవికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే.

వర్కౌట్ కాలేదు

వర్కౌట్ కాలేదు

సినీ రంగంలో తనకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో దాన్ని బేస్ చేసుకుని పొలిటికల్ గా ఎదుగుదామని ట్రై చేసిన చిరంజీవి విఫలం అయ్యారు.

150వ మూవీ..

150వ మూవీ..

రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమైన చిరంజీవి దాదాపు ఏడెనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం 150వ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

English summary
After 'Gharana Mogudu', Chiranjeevi wanted to act in a class movie in the direction of Kala Tapaswi K.Viswanadh. Then, Yedida Nageswara Rao, came forward to produce that movie, under Poornodaya Creations. Keeping in the mind of Chiranjeevi's extreme craze in the entire state, he offered Rs. 1.25 crores remuneration to Chiranjeevi and the movie was, 'Aapadbhandhavudu', that was released on 9th October, 1992. All India Superstar Amitabh Bachchan's remuneration was Rs.1 crore then.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu