ఆ యువ దర్శకుడిని చిరంజీవి ఎందుకు నమ్ముతున్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని మెగాస్టార్ నమ్మకంతో ఉన్నారు.
అయితే ఆ తరువాత సినిమాలు కూడా అదే స్థాయిలో సక్సెస్ అవ్వాలని మెగాస్టార్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకోసమే లూసిఫర్ రీమేక్ తో సరికొత్తగా ఆకట్టుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్న యువ దర్శకుడు సుజిత్ మెగాస్టార్ ప్రాజెక్టుకి సరైన న్యాయం చేయగలడా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ మెగాస్టార్ మాత్రం ఎవరెన్ని చెప్పినా అతనికి కావాలనే లూసిఫర్ రీమేక్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

అందుకు కారణం లేకపోలేదు.. బాహుబలి తరువాత ప్రభాస్ లాంటి స్టార్ హీరో క్రేజ్ కి తగ్గట్టుగా కమర్షియల్ యాంగిల్ లో 400కోట్ల బడ్జెట్ తో సాహోను రూపొందించాడు సుజిత్. అలాగే శ్రద్దా కపూర్ తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులను సెలెక్ట్ చేసుకొని వారిని అద్భుతంగా చూపించాడు. అయితే సినిమా బాలీవుడ్ లో సక్సెస్ అయినంతగా సౌత్ లో హిట్టు కాలేకపోయింది. అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సుజిత్ పనితనాన్ని మెచ్చుకున్నారు. అందుకే అతనికి లూసిఫర్ బాధ్యతల్ని అప్పగించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











