చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్, రామ్ చరణ్ చొక్కా లాగారు (ఫోటోస్)
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు హైదరాబాద్‌లోని 'చిరంజీవి ఐ అండ్ బ్లడ్' బ్యాంక్ వద్ద ఘనంగా జరిగాయి. చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ప్రత్యేక పూజల నిమిత్తం నేపాల్ వెళ్లడంతో....మెగాస్టార్ సినీ వారసులైన రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో భారీ సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు. మెగాస్టార్ బావమరిది అల్లు అరవింద్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ...అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 150వ సినిమాపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాపై నెల రోజుల్లో పూర్తి క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతానికి ఆ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉంది. కథ, డైరెక్టర్, ఇతర విషయాలు ఏమీ ఫైనల్ కాలేదని రామ్ చరణ్ తెలిపారు.
ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. పలువు ఫ్యాన్స్ రామ్ చరణ్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, దండలు వేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రామ్ చరణ్ చొక్కా లాగినట్లయింది.
స్లైడ్ షోలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు....

రామ్ చరణ్ మెడలో పూలమాల
చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా రామ్ చరణ్ మెడలో పూల మాల వేస్తున్న అభిమానులు.

వరుణ్ తేజ్
చిరంజీవి బర్త్ డే వేడుకల్లో మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు.

కేక్ కట్ చేస్తున్న దృశ్యం
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కేక్ ను రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కలిసి కట్ చేసారు.

అరవింద్
అల్లు అరవింద్ ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

రామ్ చరణ్, వరుణ్ తేజ్
చిరంజీవి బర్త్ డే కేక్ కటింగ్ అనంతరం వరుణ్ తేజ్ కి కేక్ తినిపిస్తున్న రామ్ చరణ్

సాయి ధరమ్ తేజ్
ఈ బర్త్ డే వేడుకల్లో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు.

రామ్ చరణ్ కి కేక్
రామ్ చరణ్ కి కేక్ తినిపిస్తున్న సాయి ధరమ్ తేజ్.

మాట్లాడుతున్న రామ్ చరణ్
చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న రామ్ చరణ్.

బర్త్ డే కేక్
చిరంజీవి బర్త్ డే సందర్భంగా భారీ కేక్ తయారు చేయించారు.

మెగా వారసులు
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అరవింద్

చొక్కా లాగారు
అభిమానులు చుట్టు ముట్టడంతో రామ్ చరణ్ చొక్కా లాగినట్లయింది. బటన్ ఊడి పోయి ఇలా....


Click it and Unblock the Notifications











