»   » ఆశ్చర్య పోతారు: మెగాస్టార్ కాక ముందు చిరు బర్త్‌డే పార్టీ ఇలా... (వీడియో)

ఆశ్చర్య పోతారు: మెగాస్టార్ కాక ముందు చిరు బర్త్‌డే పార్టీ ఇలా... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి నేడు 62వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. మెగాస్టార్ బర్త్ డే వేడుక అంటే ఈ రోజుల్లో అయితే ఎలా జరుగుతుంది? అంటే ఆ మధ్య జరిగిన చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుక జరిగిన తీరును ఉదాహరణగా చెప్పొచ్చు.

హైదరాబాద్‌లోని పెద్ద స్టార్ హోటల్‌లో భారీ ఏర్పాట్లు, దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమల నుండి ప్రముఖులు, రాజీకీయ నాయకులు హాజరవ్వడం లాంటివి చూశాం. మరి చిరంజీవి మెగాస్టార్ కాక ముందు ఎలా ఉండేవారు? ఆయన బర్త్ డే పార్టీ ఆ రోజుల్లో ఎలా జరిగేది? ఎలాంటి ఏర్పాట్లు చేసేవారు? అనే విషయాలు ఎంతో ఆసక్తికరం.


టాలీవుడ్ స్టార్ల మధ్య

టాలీవుడ్ స్టార్ల మధ్య

అప్పట్లోనూ ఇప్పటి లాగే స్టార్ల మధ్య చిరంజీవి బర్త్ డే పార్టీ జరిగేది. అయితే ఇప్పటి లాగా అప్పుడు స్టార్ హోటళ్లు లేవు కాబట్టి ఇంటి వద్దే ఖాళీ ప్రదేశంలో టెంట్లు, కుర్చీలు వేసి వేడుక జరిగేది. ఈ రోజుల్లో అతి సమాన్య వ్యక్తులు ఈ విధంగా పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు.


ప్రముఖులను రిసీవ్ చేసుకుంటూ చిరంజీవి

ప్రముఖులను రిసీవ్ చేసుకుంటూ చిరంజీవి

1980ల్లో చిరంజీవి బర్త్ వేడుకకు సంబంధించిన ఓ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆయనతో నటించిన హాట్ అండ్ సెక్సీ బ్యూటీ సిల్క్ స్మిత తో పాటు సుహాసిని, ఇతర హీరోయిన్లు ఈ వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబులో హల్ చల్ చేస్తోంది. సిల్క్ స్మిత, ఇతర ప్రముఖులను చిరంజీవి స్వయంగా రిసీవ్ చేసుకుంటున్నట్లు ఆ వీడియోలో ఉంది.


విందుతో పాటు అన్ని ఏర్పాట్లు

విందుతో పాటు అన్ని ఏర్పాట్లు

బర్త్ డే పార్టీకి వచ్చిన అతిథులకు విందు ఏర్పాట్లతో పాటు తాగడానికి రకరకాల పానీయాలు సిద్ధం చేసేవారు. చిరంజీవి మామయ్య, స్వర్గీయ అల్లు రామలింగయ్య ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేవారు. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు, గుమ్మడి, కైకాల సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. షాంపెయిన్ పొంగించి పుట్టినరోజు వేడేక జరుపుకున్నా మెగాస్టార్.


నాగబాబు లుక్ అప్పటికి, ఇప్పటికి...

అప్పుడు నాగబాబుకు ఇంకా పెళ్లి కాలేదేమో? ఇప్పటి నాగబాబు లుక్ తో పోలిస్తే ఆయనలో చాలా మార్పు కనిపిస్తోంది. అదే విధంగా సారా అర్జున్ తదితరులను కూడా ఇక్కడ చూడొచ్చు. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.English summary
Chiranjeevi Birth day party scene in 1980's. Megastar Chiranjeevi turns 62 today. Konidela Siva Sankara Vara Prasad, better known by his stage name Chiranjeevi is an Indian film actor, dancer, producer, singer, voice artist, politician, businessman, investor and a member of the Indian National Congress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu