చిరు బర్త్ డే మ్యానియా.. నేటితో పండుగ మొదలు!!
ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరో ఫ్యాన్స్ ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది. ఏ హీరో ఫ్యాన్స్ ఎక్కువగా యాక్టివ్ అవుతూ తమ అభిమాన దేవుడి గురించి ట్రెండ్ అయ్యేలా చేస్తారో వారే గ్రేట్, గొప్పవారని నమ్ముతున్నారు. హీరోల విషయాలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడమే ప్రస్తుతం పనిగా పెట్టుకున్నారు ఫ్యాన్స్. మరీ ముఖ్యంగా హీరోల బర్త్ డే విషయంలో దేశం మొత్తం తిరిగి చూసేలా చేస్తున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో సరికొత్త ట్రెండ్ చేయగా.. మళ్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ రికార్డులను బ్రేక్ చేశారు. ఇక ఆ రికార్డును మహేష్ బాబు ఫ్యాన్స్ దెబ్బకు రాలగొట్టారు. ఒకరిని మించి మరొకరి ఫ్యాన్స్ ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసేందుకు మెగా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇంత వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏనాడూ చిరు బర్త్ డే గురించి ట్రెండ్ చేయనేలేదు.

ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా ఆగస్ట్ మొత్తం చిరు బర్త్ డేను సెలెబ్రేట్ చేయాలని మెగా ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే నేడు ట్యాగ్, కామన్ డీపీని రిలీజ్ చేశారు. బర్త్ డే సంబరాలు మొదలయ్యాయని ప్రకటించారు.

అంతే కాకుండా 21న ఓ ప్రత్యేక పాటను కూడా రిలీజ్ చేయబోతోన్నారట. ఈ మేరకు ఈ పాటను రామ్ చరణ్ యువశక్తి దగ్గరుండి మరీ ఆ పనులను చూసుకుంటోందట.


Click it and Unblock the Notifications











