twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలో జబర్దస్త్ టీమ్ సందడి.. స్కిట్స్ వేయకుండానే!

    |

    మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22న ఆయన 64వ పుట్టిన రోజు సందర్బంగా భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ ఫంక్షన్‌కు ప్రత్యేక అతిథులు విచ్చేసి సందడి చేశారు.

    ఈ సందర్బంగా వేదికపైకి వచ్చిన జబర్దస్త్ టీమ్ స్కిట్స్ వేయకుండానే తెగ సందడి చేశారు. జబర్దస్త్ టీమ్ నుంచి సుధాకర్, రామ్ ప్రసాద్, శశి, రాకేష్, రాఘవ, గెటప్ శీను, అవినాష్, నాగి, బాబీ తదితరులు హాజరయ్యారు. సుమ పంచ్ డైలాగుల నడుమ జబర్దస్త్ నటుల రియాక్షన్స్ వేడుకకు వచ్చిన వారందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. అందరికీ ప్రతీ ఏడాది వినాయక చవితితో పండుగ మొదలవుతుంది కానీ, మనకు చిరంజీవి బర్త్ డే వేడుకతోనే పండుగ మొదలవుతుందని జబర్దస్త్ టీమ్ తరఫున గెటప్ శీను అన్నాడు. ఈ సందర్బంగా హ్యాపీ బర్త్ డే టు యూ సాంగ్ పాడి అలరించారు. ముఠామేస్త్రి సినిమాలోని పాటకు స్టెప్పులేసి జబర్దస్త్ చేశారు టీమ్.

    Chiranjeevi BirthDay Celebrations: Jabardasth team on the stage

    ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మెగా అభిమానులు తరలి రావడం విశేషం. శిల్పకళా వేదిక ప్రాంగణమంతా మెగా అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ అందరూ పాల్గొని అభిమానులకు కనువిందు చేశారు. ఇక ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కావడం మరో విశేషం. త్వరలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సారి పుట్టినరోజు వేడుక మరింత స్పెషల్ అయింది.

    English summary
    Pawan Kalyan as Chief Guest at Chiranjeevi's 64th Birthday Celebration. The ceremony take place at Shilpa Kala Vedika in Hyderabad. For this event the huze Mega fans are came from both telugu states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X