Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైం.. ఏకంగా 65 మంది సెలెబ్రెటీలతో.. మెగాస్టార్ రేంజ్ అంటే అదే!!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. ఆగస్ట్ 22 అనేది తెలుగు ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా మెగా అభిమానులకు పండగ లాంటిది. ప్రతీ ఏడాది రెండు రాష్ట్రాల్లో బర్త్ డే వేడుకలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో అందరికీ తెలిసిందే. రక్తదానాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ అభిమానులు తమ ప్రేమను చాటుతారు. అయితే ప్రస్తుతం అలాంటి వాటితో పాటు మరో పని కూడా చేయాల్సి ఉంటుంది. అదే సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేయడం, బర్త్ డేను ట్రెండ్ చేయడం. ఇవి చేస్తేనే నిజమైన అభిమానులన్నట్టుగా మారింది ప్రస్తుత పరిస్థితి.
కొత్త పద్దతి..
ఒకప్పుడు హీరోల సినిమాలు వంద రోజులు రెండు వందల రోజులు ఆడటం.. ఇలా రోజుల లెక్కన రికార్డులు ఉండేవి. అవి రాను రాను.. ఎన్ని సెంటర్లలో ఆడాయన్నది రికార్డులుగా చెప్పుకునేవారు. ఈ మధ్యనే కలెక్షన్ల పేరిట వంద కోట్ల హీరో, రెండొందల కోట్ల హీరో అంటూ మరో కొత్త పాట పాడుతున్నారు. ఇదిలా ఉండగానే సోషల్ మీడియా రికార్డులతో హీరోల స్టార్డంను కొలుస్తున్నారు.
సోషల్ మీడియాలో ఆధిపత్యం..
ప్రస్తుతం సోషల్ మీడియాలోఆధిపత్యం ఉన్న హీరోలు మహేష్ బాబు, దళపతి విజయ్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలంటే మహేష్ బాబు, విజయ్‌కే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు.వీరి ఫ్యాన్సే ఆధిపత్యం చెలాయిస్తుంటారు.
రికార్డుల విషయంలో..
ఇక సోషల్ మీడియాలోని రికార్డుల విషయంలో హీరోల ఫ్యాన్స్ మధ్య నిత్యం వార్ జరుగుతూనే ఉంటుంది. తెలుగులో అయితే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య నిత్యం వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు మహేష్ బాబు ఫ్యాన్స్ 60.2 మిలియన్ల ట్వీట్లతో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ కాకమీదున్నారు. సెప్టెంబర్ 2న ఈ రికార్డులను బద్దలుకొడతామని సవాల్ విసురుతున్నారు.
చిరుకు మొదటి బర్త్ డే..
చిరంజీవికి ఇది 65వ పుట్టిన రోజు. కానీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్ డే. అందుకే ఇది చిరు మొదటి బర్త్ డే అయింది. ఈ క్రమంలో చిరు పుట్టిన రోజులకు ఎన్నో ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఆగస్ట్ నెల మొత్తాన్ని చిరు బర్త్ డే ఫెస్ట్గా మార్చాలని మెగా ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు.
65 మంది సెలెబ్రిటీలతో..
విజయ్ బర్త్ డేకు దాదాపు 25 మంది సెలెబ్రిటీలతో కామన్ డీపీని రిలీజ్ చేయించారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఆ రికార్డును చెరిపేశారు. చిరు 65వ బర్త్ డే సందర్భంగా 65 మంది ఇండియన్ సెలెబ్రిటీలతో బర్త్ డే కామన్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు విడుదల చేసిన ఓ చిన్న టీజర్ తెగ వైరల్ అవుతోంది.