twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్‌గా చిరు బర్త్ డే.. మునుపెన్నడూ చూడని విధంగా!

    |

    ప్రస్తుతం హీరోల ఆధిపత్యం, ప్రతిష్ట సోషల్ మీడియా రికార్డులే నిర్ణయిస్తున్నాయి. ఎవరి పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.. ఎన్ని మిలియన్ల ట్వీట్లు చేశారు.. ఎంత సమయంలో చేశారు.. అనేవే హీరోల స్టామినాకు కొలమానంగా తయారయ్యాయి. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్.. తమిళంలో విజయ్, అజిత్ వంటి హీరో అభిమానుల మధ్యే ఈ తరహా పోటీ నెలకొనేది. అయితే రీసెంట్‌గా చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

    దడదడలాడిస్తున్న చిరు..

    దడదడలాడిస్తున్న చిరు..

    చిరంజీవి సోషల్ మీడియాను ఏరేంజ్‌లో రఫ్ఫాడిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాక్ డౌన్ సమయంలో చిరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. పొద్దున లేస్తే చాలు చిరు ఏం ట్వీట్ చేస్తాడా? ఎవరికి కౌంటర్ వేస్తాడా? అని ఎదురుచూసేవారు. అయితే మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా మళ్లీ పుంజుకున్నాడు.

     సరిగ్గా వాడుకుంటున్నాడు..

    సరిగ్గా వాడుకుంటున్నాడు..

    సోషల్ మీడియాను చిరంజీవి సరిగ్గా వాడుకుంటున్నాడు. మంచి సందేశాలు ఇవ్వడంతో పాటు వినోదాన్ని అందిస్తున్నాడు. అంతే కాకుండా ప్రజలకు అవగాహన కూడా కలిగిస్తున్నాడు. నిన్న మాస్కుల ధరించడం ఎంత ఆవశ్యకమో తెలియజేశాడు.

    చిరు బర్త్ డే స్పెషల్..

    చిరు బర్త్ డే స్పెషల్..

    చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత జరుపుతున్న మొదటి బర్త్ డే కావడంతో ఓ రేంజ్‌లో ప్లాన్ చేయబోతోన్నట్టు తెలుస్తోంది. చిరు బర్త్ డే ఆగస్తు 22న అని చిన్న పిల్లవాడికి కూడా తెలిసిందే. ఇక ఆగస్టు మొత్తం చిరు పుట్టిన రోజు సందడి ఉండబోతోందంటా.

    ఇండియన్ సెలెబ్రిటీలతో..

    ఇండియన్ సెలెబ్రిటీలతో..

    బర్త్ డే అంటే కామన్ డీపీలు, టాప్ ట్రెండ్, హ్యాష్ ట్యాగ్‌లు ఇవన్నీ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే చిరు బర్త్ డే కామన్ డీపీని ఇండియన్ టాప్ సెలెబ్రిటీలతో రిలీజ్ చేయించబోతోన్నారట. చిరు పుట్టిన రోజున సోషల్ మీడియాలో మాములుగా రచ్చ ఉండదంటా.

    Recommended Video

    Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
    ప్రత్యేక పాట..

    ప్రత్యేక పాట..

    చిరు బర్త్ డే కోసం ఓ ప్రత్యేకమైన పాట కూడా కంపోజ్ చేయబోతోన్నారట. ఇందు కోసం ఓ ప్రముఖ ఆడియో కంపెనీ పనులు మొదలు పెట్టిందట. చిరు బర్త్ డే అంటే ఏంటో మెగా ఫ్యాన్స్ చూపించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇక ఆచార్య టీమ్ నుంచి ఏదైనా సర్ ప్రైజ్ ఉంటుందో లేదో మరి చూడాలి.

    English summary
    Chiranjeevi Birthday Mega Fans Plans To Create Social Media New Records. We are planning to make it a solid online celebration this year," Cherry says. Besides, a special song on the legendary actor is getting ready and will be released on an appropriate date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X