మెగాస్టార్ కాకముందు చిరంజీవి పుట్టినరోజు వేడుక ఎలా జరిగేదో తెలుసా? (వీడియో)
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజంటే అభిమానులకు పండగరోజే. ఆగస్టు 22 సమీపిస్తుందనగానే తెలుగు రాష్ట్రాల్లో మెగా సెలబ్రేషన్స్ మొదలవుతాయి. సోషల్ మీడియాలో చిరంజీవి పేరుతో యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఫ్యాన్స్ అన్నదానం, రక్త దానం అంటూ సేవా కార్యక్రమాల్లో మునిగిపోతారు.
నేడు చిరంజీవి 64వ వడిలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాదిమాదిరిగానే ఈ రోజు కూడా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక రోజు ముందుగానే శిల్పకళావేదికలో భారీ ఈవెంట్ నిర్వహించారు. అయితే చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో, ఇంకా మెగాస్టార్‌గా ఎదగక ముందు పుట్టినరోజు వేడుక ఎలా జరిగేదో తెలుసా? అయితే ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ సందడి (ఫోటో గ్యాలరీ)

చిరంజీవి అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న రోజులవి..
1978 ప్రాంతంలో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరంజీవి నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నరోజులవి. తనదైన నటన, టాలెంటుతో తక్కువకాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1980లో అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో ఆయన వివాహం జరిగింది. మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టినరోజు వేడుక ఎలా జరిగేదో అలాగే చిరు పుట్టినరోజు వేడుక జరిగేది.

స్వయంగా అతిథులను ఆహ్వానిస్తూ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చిరంజీవి తన పుట్టినరోజు వేడుకలో స్వయంగా అతిథులను రిసీవ్ చేసుకుంటూ కనిపించారు. ఆ రోజుల్లో చిరంజీవితో కలిసి నటించిన సినీ స్టార్లు సిల్క్ స్మిత, సుహాసిని తదితరులతో పాటు నిర్మాతలు డి రామానాయుడు, గుమ్మడి, కైకాల సత్యనారాయణ లాంటి ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు.

అల్లుడి పుట్టినరోజు వేడుక దగ్గరుండి జరిపించిన అల్లు రామలింగయ్య
చిరంజీవి మామయ్య, స్వర్గీయ అల్లు రామలింగయ్య అప్పట్లో అల్లుడి పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించేవారు. బర్త్ డే పార్టీకి వచ్చిన అతిథులకు విందు ఏర్పాట్లతో పాటు తాగడానికి రకరకాల పానీయాలు సిద్ధం చేయడం ఆ వీడియోలో దర్శనమిస్తోంది.
వైరల్ అవుతున్న వీడియో
చిరంజీవి పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఈ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరోజుల్లో చిరంజీవి పుట్టినరోజు వేడుక ఎలా జరిగేదో.... ఈ తరం మెగా అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ షేర్ అవుతోంది.


Click it and Unblock the Notifications











