»   » చిరు కాళ్లపై వరుణ్, మెగా ఫ్యామిలీ కనువిందు (ఫోటోలు)

చిరు కాళ్లపై వరుణ్, మెగా ఫ్యామిలీ కనువిందు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ గురువారం రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రారంభమైంది. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రాండ్‍గా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.

ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ తేజ్ మినహా....ఎంటైర్ మెగాఫ్యామిలీ హీరోలతో పాటు, మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఒకరకంగా మెగా అభిమానులకు కన్నుల విందుగా ఈకార్యక్రమం జరిగిందని చెప్పొచ్చు. ఈ మూవీ పూజా కార్యక్రమం సందర్భంగా చిరంజీవి-సురేఖ దంపతులకు పాదాభివందం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు వరుణ్ తేజ్.

చిరంజీవి తల్లితో పాటు, ఇతర కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అరవింద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో....

పాదాభివందనం

పాదాభివందనం

చిరంజీవి దంపతులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుంటున్న వరుణ్ తేజ్.

వరుణ్‌కి ఆశీర్వాదం

వరుణ్‌కి ఆశీర్వాదం

వరుణ్ తేజ్ సినీ ప్రస్తానం విజయవంతంగా సాగాలని ఆశీర్వదిస్తున్న వేదపండితులు, సినీరంగ పెద్దలు.

బన్నీ ఉత్సాహం

బన్నీ ఉత్సాహం

వరుణ్ తేజ్ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అర్జున్ చాలా ఉత్సాహంగా కనిపించారు. అందరినీ నవ్వించే ప్రయత్నం చేసారు.

మెగా వారసుడు

మెగా వారసుడు

మా కుటుంబం నుండి వస్తున్న మరో మెగావారసుడు అంటూ వరుణ్ తేజ్‌ను అభిమానులకు పరిచయం చేస్తున్న చిరంజీవి.

చిరంజీవి క్లాప్

చిరంజీవి క్లాప్

ఈచిత్ర హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ పూజా హెడ్గేలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొడుతున్న చిరంజీవి.

మెగా కుటుంబ సభ్యులు

మెగా కుటుంబ సభ్యులు

చిరంజీవి తల్లితో పాటు, ఇతర కుటుంబ సభ్యులు వరుణ్ తేజ్ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

English summary
Nagendra Babu Son Varun Tej starring Leo Entertainments Production No 1 Movie Launch event held at Ramanaidu Studios, Hyderabad. Chiranjeevi, Pawan Kalyan, Sunil, Allu Arjun, Allu Aravind, Allu Sirish, Director Srikanth Addala, Varun Tej, Pooja Hegde, Nagababu, K.Raghavendra Rao, D.Suresh Babu, Nallamalapu Bujji, VV Vinayak, Surekha Chiranjeevi, Sai Dharam Tej, Chota K. Naidu graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu