సోషల్ మీడియాలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్!
హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ గత కొన్నేల్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులు అండదండలతో విజయవంతంగా సాగుతున్న ఈ ఆర్గనైజేషన్ తాజాగా సోషల్ మీడియాలోకి ఎంటరైంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ఆరదణ ఎక్కవగా ఉండటంతో......మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మెగా బ్రదర్ నాగ బాబు ఆధ్వర్యంలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సోషల్ మీడియా పేజీని ప్రారంభించారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు ఎప్పటి కప్పుడు తెలుసుకునేందుకు ఈ సోషల్ మీడియా పేజ్ దోహదం కానుంది.

ఈ సందర్భంగా అల్లు అరవింద్, నాగ బాబు ట్విట్టర్ ద్వార అభిమానులకు సందేశం పంపారు. 'డియర్ బ్లడ్ బ్రదర్స్, ఫేస్ బుక్ పేజ్ ఓపెన్ చేయాలనే ఆలోచన చేసిన అభిమానులకు/బ్లడ్ బ్రదర్స్ కు వ్యక్తిగతంగా థాంక్స్ చెబుతున్నాను. ఇక నుండి కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఆల్ ది బెస్ట్' అని అల్లు అరవింద్ ట్వీట్ చేసారు.
'డియర్ ఫ్యాన్స్, బ్లడ్ డోనర్స్ అండ్ వెల్ విషర్స్. ఐ అండ్ బ్లడ్ బ్యాక్ ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. బ్లడ్ బ్యాంక్ సేవలు మరింత విస్తరించడానికి ఇది దోహద పడుతుంది. అందరికీ థాంక్స' అంటూ నాగ బాబు ట్వీట్ చేసారు.


Click it and Unblock the Notifications











