twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌పై ఏపీ సర్కార్ వరాల జల్లు.. వైజాగ్ కేంద్రంగా సినీపరిశ్రమ.. సీఎంను అందుకే కలువలేదు.. చిరు

    |

    గత ఏడాది కాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలువాలని అనుకొన్నాం. సరైన సమయం కుదరక, కొన్ని పరిస్థితుల కారణంగా కలువలేకపోయాం. ఈ రోజు వారిని కలవడం సంతోషంగా ఉంది. వారిని కలవడం ధన్యవాదాలు తెలిపాం. తెలుగు సినిమా పరిశ్రమ సమస్యలను ఆయనకు విన్నవించాం. కరోనా కారణంగా సినిమా షూటింగులు చేయడానికి కష్టంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కలిస్తే వారు జూన్ రెండోవారంలో అనుమతిలిచ్చారు. అలాగే ఏపీ ప్రభుత్వాన్ని కలిసి అనుమతులు ఇవ్వాలని కోరితే సీఎం జగన్ వెంటనే స్పందించారు అని చిరంజీవి చెప్పారు.

    విద్యుత్ రాయితీలు

    విద్యుత్ రాయితీలు

    టాలీవుడ్ పరిశ్రమ రిక్వెస్ మేరకు ఏపీ ప్రభుత్వం టెలివిజన్, సినీ షూటింగులకు ప్రోత్సాహకాలు అందిస్తామని సానుకూలంగా స్పందించింది. విద్యుత్ ఛార్జీల రాయితీ ఇవ్వాలని కోరితే అందుకు సమ్మతించారు. విద్యుత్ బిల్లులకు సంబంధించి ఫిక్స్‌డ్ చార్జీలు తగ్గించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సినీ పరిశ్రమ తరఫున ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం అని చిరంజీవి తెలిపారు.

    నంది అవార్డులు వేడుక

    నంది అవార్డులు వేడుక

    ఇక కొన్ని ఏళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టాలని సినీ పరిశ్రమ తరఫున రిక్వెస్ట్ చేశాం. కళాకారులకు, నటులకు అవార్డులు మంచి ప్రోత్సాహకాలుగా ఉంటాయి. వాటిని వెంటనే అందించాలని కోరాం. అందుకు ప్రభుత్వం పాజిటివ్‌గా స్పందించింది. ఈ ఏడాదిలో ఓ మంచి వాతావరణ పరిస్థితుల్లో నంది అవార్డుల అందజేతకు వేడుకను నిర్వహిస్తామని చెప్పారు అని చిరంజీవి తెలిపారు.

    టికెట్ల రేట్లు పెంపుకు గ్రీన్ సిగ్నల్

    టికెట్ల రేట్లు పెంపుకు గ్రీన్ సిగ్నల్

    సినిమా టికెట్ల పెంపు విషయంలో పారదర్శకత ఉండాలని కోరాం. ముంబై, చెన్నై నగరాల్లో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు పెంచుకొనే అవకాశం ఉంది. అలాంటి టికెట్ల రేటు పెంపు ఏపీలో ఉండాలని కోరాం. అందువల్ల నిర్మాతకు మేలు జరుగుతుందని తెలిపితే ఏపీ సీఎం అందుకు సానుకూలంగా స్పందించారు. మా కోరికపై స్పందిస్తూ.. అధికారులతో చర్చి నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు. భారీ బడ్జెట్ సినిమాలకు అనుగుణంగా టికెట్ల ధర పెంపు సరళీకృతం అవుతుంది. టికెట్ల రేట్ల విషయంలో పారదర్శకత ఉంటే బ్లాక్ టికెటింగ్‌ను అరికట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పాం. అందుకు సానుకూలంగా స్పందించారు అని అన్నారు.

    వైజాగ్ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ది

    వైజాగ్ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ది

    గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖపట్నంలో స్టూడియోల నిర్మాణానికి 300 ఎకరాల భూమి కేటాయించారు. వైజాగ్‌ కేంద్రంగా సినిమా పరిశ్రమ అభివృద్దికి పాటుపడాలని కోరితే అందుకు సీఎం వైఎస్ జగన్ పాజిటివ్‌గా స్పందించారు. మేము అడిగిన ప్రతి విషయానికి సానుకూలంగా స్పందించినందుకు తెలుగు సినిమా పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అని చిరంజీవి తెలిపారు.

    సీఎంను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు వీరే

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, సీ కల్యాణ్, దామోదర్ ప్రసాద్, రాజమౌళి తదితరులు ఉన్నారు. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ తర్వాత ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు చిరంజీవి వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని కూడా ఉన్నారు.

    Recommended Video

    Tollywood Stars Chiranjeevi & Others Met AP CM YS Jagan Over TFI Isuues
    జూలై 15 తర్వాత

    జూలై 15 తర్వాత

    జూలై 15 తర్వాత ఏపీలో షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయని, దీంతో షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారని చిరంజీవి పేర్కొన్నారు.

    English summary
    Tollywood big wigs Chiranjeevi, others met AP CM YS Jagan Mohan Reddy. Tollywood industry framed Film Industry development in AP and other excemptions for film shootings etc.,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X