సోషల్ మీడియా ఎఫెక్ట్, మెగాస్టార్ సపోర్ట్.... మట్టిలో మాణిక్యం బేబీ దశ తిరిగినట్లేనా?

తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరు గ్రామానికి చెందిన 40 సంవత్సరాల బేబీ అనే మహిళలో అద్భుతమైన సింగింగ్ టాలెంట్ ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆమె టాలెంటును చూసి ఏఆర్ రెహమాన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టరే ముద్ధుడైపోయారంటే ఆమె టాలెంట్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

సోషల్ మీడియా ఎఫెక్టుతో విషయం మెగాస్టార్ సతీమణి సురేఖ వరకు చేరింది. ఆమె ద్వారా బేబీ గురించి తెలుసుకున్న మెగాస్టార్ ఇటీవల ఆమెను తన ఇంటికి పిలిపించి అభినందించారు. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ ఉంటుందని ఆశీర్వదించారు.

మెగాస్టార్ సపోర్ట్... మెగా మూవీలో ఛాన్స్?

మెగాస్టార్ సపోర్ట్... మెగా మూవీలో ఛాన్స్?

మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పిలిచి అభినందించడంతో తప్పకుండా త్వరలోనే ఆమెకు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అయితే అది చరణ్ సినిమాలో ఉంటుందా? లేక ఇతర మెగా హీరోల సినిమాలో ఉంటుందా? అనేది త్వరలోనే తేలనుంది.

సైరా వేడుకలో బేబీ ప్రదర్శన

సైరా వేడుకలో బేబీ ప్రదర్శన

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా విడుదల ముందు జరిగే సైరా ప్రీ రిలీజ్ ఈవెంటులో బేబీతో సింగింగ్ పెర్ఫార్మెన్స్ ఇప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ఇండస్ట్రీ దృష్టిలో పడటం ఖాయం

ఇండస్ట్రీ దృష్టిలో పడటం ఖాయం

‘సైరా'నరసింహారెడ్డి' సినిమా ఫంక్షన్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు దర్శకులకు, హీరోలు, సింగీత దర్శకులు హాజరు కానున్నారు. అక్కడ తన సింగింగ్ ప్రదర్శన ఇవ్వడం ద్వారా బేబీకి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

చిరంజీవిని చూడగానే బేబీ భావోద్వేగం

చిరంజీవిని చూడగానే బేబీ భావోద్వేగం

కాగా... ఇటీవల చిరంజీవి కలిసిన బేబీ ఆయన్ను చూడగానే బేబీ భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే ఆయన కాళ్ల మీద పడిపోయి... ఈ జీవితానికి ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. ఈ జన్మకు చచ్చిపోయినా ఫర్వాలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X