‘జంజీర్’లో చిరంజీవి గెస్ట్ రోల్?
హైదరాబాద్ : మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ..అంతకు ముందే ఆయన వెండితెరపై దర్శనం ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న 'జంజీర్' చిత్రంలో చిరంజీవి అతిథి పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
గతంలో మగధీర సినిమాలో రామ్ చరణ్‌తో చిరంజీవి స్టెప్పులేయించిన సీన్‌కు రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో జంజీర్ చిత్రంలో కూడా చిరంజీవితో గెస్ట్ రోల్ చేయించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. పైగా చరణ్‌కు తొలి బాలీవుడ్ సినిమా కాబట్టి తండ్రి కొడుకులు కలిసి స్క్రీన్ పై కనిపిస్తే బాలీవుడ్ ప్రేక్షకుల్లో చెర్రీకి పాపులారిటీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
'జంజీర్' రీమేక్ చేయటం ద్వారా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న రామ్ చరణ్..పాత్రను ఛాలెంజ్ గా తీసుకున్నానని చెప్తున్నారు. రామ్‌చరణ్ సరసన ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం రీమేక్‌లో నటించడం ద్వారా తనకు బాలీవుడ్లో మంచి పాపులారిటీ వస్తుందని చరణ్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











