»   » ఆ స్టోరీ చేసేది కేవలం చిరంజీవి మాత్రమే!

ఆ స్టోరీ చేసేది కేవలం చిరంజీవి మాత్రమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా... గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్. అదిగో ఇదిగో అంటూ సంవత్సరాలకు సంవత్సరాలు సాగిస్తున్నారు. సరైన స్టోరీ దొరకక పోవడం వల్లనే 150వ సినిమా మొదలు కావడం లేదని అభిమానులు అడిగినప్పుడల్లా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి, రామ్ చరణ్.

చిరంజీవి 150వ సినిమా చేయడం మాత్రం ఖాయం. ప్రస్తుతం కథల గురించి అన్వేషణ తీవ్రంగా సాగుతోంది. ఇటీవల కత్రి రీమేక్ లో చిరంజీవి చేద్దామని అనుకున్నారు కానీ.... ఫ్రెష్ స్టోరీ చేయాలని అభిమానుల నుండి ఒత్తిడి పెరగడంతో వెనక్కి తగ్గారు. తాజాగా ఫిల్మ్ నగర్లో మరో స్టోరీ హాట్ టాపిక్ అయింది.

Chiranjeevi Can Consider This Story

హిందీలో రాజ్ కుమార్ హిరానీ సంజయ్ దత్ హీరోగా మున్నాభాయ్ సిరీస్ లో రెండు సినిమాలు చేసారు. అవే సినిమాలు చిరంజీవి తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. తాజాగా రాజ్ కుమార్ హిరానీ మున్నాయ్ మూడో పార్ట్ కూడా అనౌన్స్ చేసారు.

హిందీలో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కితే.... తెలుగులో చిరంజీవి దాన్ని చేయడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే తొలి రెండు పార్టులు చిరంజీవి చేసిన నేపథ్యంలో చిరంజీవిని తప్ప ఆ స్టోరీలో మరో హీరోను ఊహించుకోవడం కష్టమే.

మున్నాయ్ భాయ్ మూడో భాగాన్ని రాజ్ కుమార్ హిరానీ పూర్తి విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ తెలుగు వెర్షన్లో మాత్రం చిరంజీవి నటించడం ఖాయం.

English summary
Raju Hirani had announced the third part and after PK, he is on a totally different plane. Chiranjeevi had acted in the Telugu remakes of Munnabhai. So it is logical for him to act in the third part too.
Please Wait while comments are loading...