Chiranjeevi: క్యాన్సర్‌పై చిరంజీవి క్లారిటీ.. మీడియాకు చురకలు.. అసలు మెగాస్టార్ చెప్పింది ఏంటీ?
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. కొంతకాలం రాజకీయాలతో సినిమాలకు దూరంగా ఉన్న ప్రస్తుతం వరుస పెట్టి చిత్రాలతో జోష్ చూపిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చాటుతున్న చిరంజీవి ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందు నిలబడి సాయం అందించే ఆయన క్యాన్సర్ బారిన పడినట్లు వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చార మెగాస్టార్.
టాలీవుడ్ లో ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించేందుకు ఒక అడుగు ముందు ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించి తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ కష్టాలు పడే ఎంతో మందికి సాయం అందిస్తూ చేయూతనిస్తుంటారు. ఇలా సహాయం అందుకున్న వాళ్లలో అనేక మంది నటీనటులు ఉన్నారు. అయితే ఇవాళ అంటే జూన్ 3న ఆయన క్యాన్సర్ బారిన పడినట్లు వచ్చిన వార్తలు షాకింగ్ గురి చేశాయి. ఈ వార్తలపై ట్విటర్ వేదికగా చిరు క్లారిటీ ఇచ్చారు.

"కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో నాన్-కాన్సేరియస్ పాలిప్స్ ని డికెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను.
అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయి ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నాను. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు, స్క్రీనింగ్ చేయించుకోవాలి అని మాత్రమే అన్నాను" అని చిరంజీవి పేర్కొన్నారు.
ఇంకా చిరంజీవి ట్వీట్ లో కొనసాగిస్తూ.. "కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో నేను క్యాన్సర్ బారిన పడ్డాను అని, చికిత్స వల్ల బతికాను అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది.
అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకు ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయబ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు" అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











