వాల్తేరు వీరయ్య సెట్స్ లో మెహర్ రమేష్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్లో మెహర్ రమేష్ ఇటీవల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అతనికి పుట్టినరోజు వేడుకలను వాల్తేరు వీరయ్య సెట్స్ లోనే నిర్వహించారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మారుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఒక ప్రత్యేకమైన సాంగ్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే మెహర్ రమేష్ సెట్స్ లోకి రాగానే మెగాస్టార్ చిరంజీవితో పాటు ఊర్వశీ అతని బర్త్ డెను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవితో మెహర్ రమేష్ బోలా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా మెహర్ రమేష్ ఈసారి బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది అని మొదట ఒక టాక్ అయితే వచ్చింది.

కానీ ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ఇక మరోవైపు బోలా శంకర్ సినిమా 2023 సమ్మర్ లో లేదా ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ సినిమా తమిళ మూవీ వేదళంకు రీమేక్ తెరపైకి రానున్న విషయం తెలిసిందే. ఇంతవరకు మెహర్ రమేష్ రీమేక్ సినిమాలలో పెద్దగా ఫ్లాప్స్ ఎదుర్కొన్నది లేదు. మరి బోలా శంకర్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











