తొమ్మిదేళ్లుగా జరుగుతూనే ఉంది.. ఈ సారి చిరంజీవి ఇంట్లో! మెగాస్టార్ స్వయంగా..
శని, ఆదివారాల్లో మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు జరిగాయి. ఆ నాటి తారలంతా చిరు ఇంటికి చేరి తెగ సందడి చేశారు. వాళ్లందరికీ చిరంజీవి స్వయంగా ఫుడ్, కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఇంతకీ చిరంజీవి ఇంట్లో స్పెషల్ ఏంటి? తారలంతా అక్కడకు చేరి ఎందుకు సందడి చేశారు? వివరాల్లోకిపోతే..

80's తారలతో రీ యూనియన్
80's తారలంతా కలిసి ప్రతీ ఏటా రీ యూనియన్ పార్టీ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం గత తొమ్మిదేళ్లుగా జరుగుతూనే ఉంది. ఈ పార్టీలో 80's హీరోహీరోయిన్లు
అందరూ ఒక్కచోట చేరి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఈ వేడుకకు చిరంజీవి ఇల్లు వేదిక కావడం విశేషం.

రెండు రోజుల పాటు చిరంజీవి ఇంట్లో
80వ దశకంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సినీ తారలు అంతా చిరంజీవి ఏర్పాటుచేసిన రీయూనియన్ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో 80's నాటి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటులు ఒకే చోట చేరి సందడి చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి.

మెగా పార్టీలో ఎవరెవరు హాజరయ్యారంటే..
ఈ మెగా పార్టీకి హాజరైన వారిలో వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్, నరేష్, సురేష్, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్, జాకీ ష్రాఫ్, జగపతిబాబు తదితరులు ఉన్నారు. మొత్తంగా 37 మంది తారలు సందడి చేశారు.

గత తొమ్మిదేళ్లుగా వాళ్ళు.. ఇప్పుడు చిరంజీవి
గత తొమ్మిదేళ్లుగా జరుగుతున్న ఈ రీ యూనియన్ పార్టీకి మోహన్ లాల్, మమ్ముట్టి, రాధిక శరత్ కుమార్, సుహాసిని, రవిచంద్రన్, అంబరీష్ లాంటి వాళ్లు హోస్ట్ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది ఆ అవకాశం చిరంజీవి తీసుకోవడం విశేషం. చిరు ఇంట జరిగిన ఈ సంబరాల్లో ఆయనే స్వయంగా అందరికీ సర్వ్ చేయడం మరో విశేషం.
Recommended Video
సూపర్ స్టార్ రియాక్షన్
ఈ సందర్బంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫొటోలో చిరంజీవి కుర్చీలో కూర్చొని ఉండగా మోహన్ లాల్ ఆయన్ని వెనుక నుంచి ఆప్యాయంగా భుజాలపై నుంచి రెండు చేతులు వేసి పట్టుకున్నారు. ‘నా అమేజింగ్ ఫ్రెండ్ చిరంజీవితో నేను' అని ట్వీట్‌లో మోహన్ లాల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











