జయప్రద కొత్త చిత్రానికి క్లాప్ కొట్టిన చిరంజీవి
హైదరాబాద్ :తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రం 'మాతృదేవోభవ'. ఇప్పుడీ సినిమాను జయప్రద భోజ్‌పురిలో చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌నిచ్చారు. టి.సుబ్బరామిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎ.కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఆమె సరసన భోజ్‌పురి సూపర్‌స్టార్ మనోజ్ తివారి నటిస్తున్నారు. కేడీ దర్శకత్వంలో స్టూడియో 9 ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ...''ఇప్పటి వరకూ ఎనిమిది భాషల్లో సినిమాలు చేశాం. భోజ్‌పురి తొమ్మిదోది. ఈ భాషలో సినిమా చేయడం ఇదే ప్రథమం. ఏపీలో పుట్టి పెరిగి ఒక స్థాయికి చేరుకున్న నేను ప్రజా నాయకురాలిగా యూపీ ప్రజలతో మమేకమైపోయాను. వారి కోసమే భోజ్‌పురిలో సినిమా చేస్తున్నా. షూటింగ్ అంతా హైదరాబాద్‌లోనే చేస్తాం. ఇందులో రాఖీసావంత్‌పై ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంది. త్వరలో తెలుగులో కూడా సినిమా నిర్మాణం చేస్తాను. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను'' అని తెలిపారు.
అలాగే..''ఉత్తరప్రదేశ్‌లో రెండుసార్లు ఎంపీగా గెలిచాను. అక్కడి పరిసరాలు నాకు బాగా అలవాటయ్యాయి. అక్కడి భోజ్‌పురి చిత్ర పరిశ్రమ కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో ఇలా ఈ చిత్రాన్ని మొదలుపెట్టా. ఇప్పటి వరకూ నేను ఎనిమిది భాషల్లో నటించాను. భోజ్‌పురి చిత్రంతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. 'మాతృదేవోభవ' నాకెంతో ఇష్టమైన చిత్రం. సింహభాగం చిత్రీకరణ హైదరాబాద్‌లోనే జరుపుతాం. త్వరలోనే తెలుగులోనూ ఓ చిత్రం చెయ్యబోతున్నాను'' అని చెప్పారు జయప్రద.
దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచినా 'మాతృదేవోభవ' చిత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంలో వేటూరి రాసిన 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...' పాటకు జాతీయ అవార్డు వచ్చింది. అంతగా ప్రేక్షకుల్ని హత్తుకున్న ఈ చిత్రంలో మాధవి అద్భుతంగా చేసిన పాత్రను జయప్రద చేయబోతున్నారు.
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, డి.రామానాయుడు, మురళీమోహన్, జి.ఆదిశేషగిరిరావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శత్రుఘ్నసిన్హా, రాఖీ సావంత్ తదితరులు నటిస్తారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీనివాస్‌రెడ్డి, సమర్పణ: అభయ్ సిన్హా. సహనిర్మాతలు: ఆర్.వి.కృష్ణారావు, విజయ్.


Click it and Unblock the Notifications












