చిరు..క్లాప్ కొట్టేది అందుకా?

అయితే పూర్తిగా ప్రజారాజ్యం పార్టీ కార్య కలాపాల్లో బిజీగా ఉన్న చిరంజీవి ఈ మాటవ్వటం వెనక ఊహకందని కోణం ఉందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇలా ఆ ముహుర్తానికి అటెండయి క్లాప్ కొట్టడం ద్వారా ప్రజల్లో శ్రీకాంత్ కీ,తనికీ మధ్య ఏ గొడవ లేదనే టాక్ వస్తుందని చిరు భావిస్తున్నారుట. దాని వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతుందని అనుకుంటున్నారుట. అందులోనూ శ్రీకాంత్ కి పార్టీ వ్యవహారాల్లో ప్రయారిటీ ఇవ్వటం లేదని ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా తొలిగిపోతుందని శ్రేయాభిలాషులతో చెప్తున్నారుట. ఇక ఈ మహత్మా ఓపినింగ్ ఈ నెల పదహేనున జరగనుంది. పరుచూరి బ్రదర్శ్ స్క్రిప్టు అందించే ఈ చిత్రం వరంగల్ యాసిడ్ దాడుల నేపధ్యంలో రూపొందినట్లు వినపడుతోంది. బెంగుళూరు కి చెందిన ఓ పారిశ్రామిక వేత్త ఈ చిత్ర నిర్మాతగా వ్యవహిరంచనున్నాడు.


Click it and Unblock the Notifications











