twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె మా అమ్మ కాదు.. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే.. ఫేక్ న్యూస్‌పై చిరు క్లారిటీ

    |

    ఓ వైపు కరోనా విజృంభిస్తూ ఉంటే.. మరోవైపు తప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకునే లోపే జరగాల్సిందంతా జరిగిపోతోంది. ఫేక్ న్యూస్ అనేది ఎంతలా వైరల్ అవుతుందో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ. ఆ వార్తలు తిరిగి తిరిగి మెగాస్టార్ చిరంజీవి చెవిలో పడ్డాయి. వెంటనే తేరుకుని అవి తప్పుడు వార్తలు అని చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    మెగా సాయం..

    మెగా సాయం..

    కరోనా లాంటి కష్టకాలంలో ప్రభుత్వాలకు, సినీ కార్మికులకు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో చిరంజీవి సీసీసీ అంటూ సినీ కార్మికుల కోసం ఓ ఛారిటీని కూడా ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వంటివారు తమకు తోచిన సాయాన్ని అందించారు. ఇదే క్రమంలో చిరంజీవి తల్లి అంజనాదేవీ కూడా తన వంతు సాయాన్ని చేసిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది.

    అంజనాదేవీ అంటూ వార్తలు..

    అంజనాదేవీ అంటూ వార్తలు..

    చిరంజీవి తల్లి అంజనాదేవీ మూడు రోజుల పాటు శ్రమించి.. 700 మాస్క్‌లు తయారు చేసిందని వార్తలు హల్చల్ చేశాయి. తన వృద్దాప్యాన్ని కూడా లెక్కచేయకుండా స్నేహితురాళ్లతో కలిసి మాస్క్‌లు కుట్టిందని, అవసరమైన వారికి వాటిని పంచిందని కూడా ప్రచురించారు. దీంతో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

    స్పందించిన చిరు..

    స్పందించిన చిరు..

    నేటి ఉదయం నుంచి అంజనమ్మ పేరు వార్తల్లో హల్చల్ చేయసాగింది. ఇలాంటి సమయంలోనూ అంజనమ్మ తన చేతనైన సాయం చేసిందని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. మీడియాలోనూ ఈ వార్తలను ప్రముఖంగా ప్రచురించారు. దీంతో ఈ వార్తలు చిరు వద్దకు చేరాయి. వీటిపై సోషల్ మీడియాలో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు.

    Recommended Video

    Akira Nandan Enormous Craze In Social Media

    కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే..

    ‘కొన్ని వార్తా పత్రికలు, మీడియాలో చానెల్స్‌లో ప్రచురించిన వార్త ఇది. మా తల్లి మాస్క్‌లు కుడుతుందని వచ్చిన వార్తలు అబద్దం. ఆమె మా అమ్మ కాదు.. అయితే ఇలాంటి సమయంలో ముందుకు వచ్చి సేవ చేస్తున్న ఆ అమ్మకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే' అంటూ ట్వీట్ చేశాడు.

    English summary
    Chiranjeevi Clarifies That humanitarian worker Is Not His Mother. It is reported in press & some media channels that my mother is doing this humanitarian work. I humbly seek to clarify that it is not my mother but whichever mother is engaged in this great act of compassion I heartily thank her for such kindness.కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X