twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్‌డౌన్‌లో ఇంటి పనుల్లో చిరు బిజీ.. ఏం చేస్తున్నారో తెలుసా? వైరల్‌గా వీడియో

    |

    మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచీ.. అభిమానులకు, ప్రజలకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు. తాను సోషల్ మీడియాలో అడుగు పెట్టడానికి కారణం కూడా అదేనని చెప్పుకొచ్చాడు.. తన భావాలను, ఆలోచనలను, సందేశాలను ప్రజలతో నేరుగా పంచుకోవడానికి ఈ సాధనాన్ని వాడుకుంటానని తెలిపాడు. అన్నట్టుగానే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిని ఉతికి ఆరేస్తున్నాడు. తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ చక్కని సందేశాన్ని ఇచ్చాడు. అదేంటో ఓ సారి చూద్దాం.

    Recommended Video

    Megastar Chiranjeevi Busy With Gardening Works In His Home During Lockdown
     కరోనాపై అవగాహన..

    కరోనాపై అవగాహన..

    ట్విట్టర్‌లోకి ఉగాది నాడు అడుగుపెట్టిన చిరంజీవి.. నాటి నుంచి రోజు ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. మొదటి ట్వీట్‌లో ఉగాది శుభాకాంక్షలు చెప్పిన చిరు.. రెండో ట్వీట్‌లో కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ప్రధాని, సీఎంల నిర్ణయాలకు మద్దతిస్తూ, ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని సూచించాడు.

     సినీ కార్మికుల కోసం ముందడుగు..

    సినీ కార్మికుల కోసం ముందడుగు..

    కరోనా కట్టడి లాక్ డౌన్ విధించడం, సినీ పరిశ్రమ కార్యకలాపాలు ఆగడం, కార్మికులు ఉపాధి కోల్పోవడంతో వారికి అండంగా చిరంజీవి నిలబడ్డాడు. కోటి రూపాయల విరాళాన్ని అందించి.. కరోనా క్రైసిస్ ఛారిటినీ స్థాపించాడు. తోటీ నటీనటులను కూడా విరాళం ఇవ్వమని పిలుపునిచ్చాడు. ఇలా వచ్చిన నిధులతో సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.

    లాక్ డౌన్‌‌లో చిరు పనులు..

    లాక్ డౌన్‌లో చిరంజీవి చేసే పనులను, చేయాల్సిన పనులకు సోషల్ మీడియాలో వివరిస్తున్నాడు. తాను ఉదయాన్నే లేచి మొక్కలకు నీరు పడతానని అదే తన హాబీ అని పేర్కొన్నాడు. ఉదయాన్నే లేచి ప్రశాంతంగా ఉన్న నగరాన్ని, సూర్యోదయాన్ని చూస్తూ ఉన్న వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్స్ మంచి సందేశాలను ఇస్తూ ఉంటాడు.

     వెళ్లే దారి సైతం శుభ్రంగా..

    వెళ్లే దారి సైతం శుభ్రంగా..

    లాక్ డౌన్‌లో తాను చేసే పనులు ఇవే అంటూ చిరంజీవి ఓ వీడియోను షేర్ చేశాడు. ఇంటి గార్గెన్ ఏరియాలో నడిచే దారిని నీటితో శుభ్రం చేస్తూ ఉన్న వీడియోను చిరు కాసేపటి క్రితమే షేర్ చేశాడు. మనం నడిచే దారులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలంటూ ఓ మెసెజ్ ఇచ్చాడు. మెగాస్టార్ అయిన ఇంటి పని చేసుకుంటూ ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Chiranjeevi Clean Garden Area In Lockdown. He Shared A Video That With A Message, The Path We Take Should Be Clean
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X