అనుష్కని చిరంజీవి గుర్తు పట్టలేదా?
'పంచాక్షరి సినిమాకి సంబంధించిన ట్రైలర్స్‌ను చిరంజీవిగారు చూసి "ఎవరీ అమ్మాయి, బాగుంది..అని అన్నారని తెల్సింది. దాన్ని బట్టి నా గెటప్ ఆ చిత్రంలో వినూత్నంగా ఉందనడానికి అదొక నిదర్శనంగా చెప్పొచ్చు అంటోంది అనుష్క. ఇదివిన్న వారు మరీ బడాయి కాకపోతే అనుష్కని గుర్తు పట్టలేనంతలా మేకప్ చేసుకుందా లేక చిరంజీవే మర్చిపోయారా అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... పంచాక్షరిలాంటి సినిమా, అందులోని కేరక్టరు అరుదుగా వస్తుంటాయి. ఈ పాత్రలో నేను చాలా కొత్తగా కనిపించాను. ఈ మొన్నటి వరకు 'అరుంధతి అనుష్క అన్నారు. ఇప్పుడు నన్ను 'పంచాక్షరి అంటున్నారు. ఈ ఇమేజ్‌ని భవిష్యత్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూద్దాం అంటోంది. అయితే పంచాక్షరి చిత్రం ఇప్పటికే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ డ్రాప్ అయ్యి కూర్చుంది.
అనుష్క పంచాక్షరి అరుంధతి చిరంజీవి సముద్ర శ్యామ్ ప్రసాద్ రెడ్డి చంద్ర anushka panchakshari arundhati samudra chandra


Click it and Unblock the Notifications