అమ్మనేమో అలా.. భార్య ఇలా.. ఇదీ విషయం అని చెప్పేసిన చిరంజీవి
ఏదైనా పని చేసినప్పుడు సొంత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అప్రిసియేషన్ పొందితే ఆ ఆనందమే వేరు. దీనికి మెగాస్టార్ అయినా.. ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా మినహాయింపు కాదు. తాజాగా ఇదే కోవలో తన తల్లి అంజనీ, భార్య సురేఖ చేసిన కామెంట్స్ గురించి చెబుతూ తెగ మురిసిపోయారు మెగాస్టార్ చిరంజీవి. తన కొత్త సినిమా 'సైరా నరసింహా రెడ్డి' పై వారిరువురి అభిప్రాయాలు ఇలా ఉన్నాయని పేర్కొంటూ సంబర పడ్డారు చిరు. ఆ విశేషాలేంటో చూద్దామా..

కెరీర్‌లో తొలిసారి ఇలా
1978 సంవత్సరంలో పునాది రాళ్లు సినిమా ద్వారా సెట్స్ మీదకొచ్చిన చిరంజీవి అలుపెరగని జర్నీ కొనసాగిస్తూ 150 సినిమాల మైలురాయిని దాటేశారు. అయితే ఈ జర్నీలో ఆయన ఇప్పటిదాకా చారిత్రక నేపథ్యంలో నటించలేదు. సో ఆ లోటు పూడ్చాలని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పూనుకున్నారు. చిరంజీవి హీరోగా తన నిర్మాణంలో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా రూపొందించారు.

రష్ కాపీ చూసిన అల్లు అరవింద్
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా రష్ కాపీ ఇప్పటికే అల్లు అరవింద్ చూసి చాలా ఆనంద పడ్డారని, ఇక తన తల్లి అంజనీ దేవి అయితే సైరా గెటప్పు చూసే ఆనందంలో మునిపోయిందని చెప్పారు చిరంజీవి.

తల్లి అంజనీ దేవి ఇలా అనేసింది
సైరా రష్ కాపీ చూడమని తన తల్లి అంజనీ దేవిని కోరగా.. అభిమానుల కోలాహలం మధ్య మొదటి రోజు మొదటి షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో చూస్తానని చెప్పిందని తెలిపారు చిరంజీవి. కేవలం సైరా పోస్టర్స్ చూసి నువ్వు నువ్వుల లేవురా అంటూ తన తల్లి తెగ సంబరపడిందని చెప్పారు మెగాస్టార్.

ఇక భార్య సురేఖ ఇలా
సైరా నరసింహా రెడ్డి సినిమా పట్ల తన భార్య ఫీలింగ్స్ కూడా ఎలా ఉన్నాయో చెప్పారు చిరు. సైరాలో నా కన్నా తన కొడుకు రామ్ చరణ్ చూసే సురేఖ గర్వపడుతోందని ఆయన అన్నారు. ఇంత పెద్ద హీరోలైనా మీరు గానీ, పవన్ గానీ తనకు సినిమా సమర్పించే అవకాశం ఇవ్వలేదని, తన కొడుకు రామ్ చరణ్ ఆ అవకాశం ఇచ్చాడని సురేఖ మురిసిపోతోందని అన్నారు చిరు.

టీజర్, ట్రైలర్ సెన్సేషన్.. సెన్సార్
సైరా నరసింహా రెడ్డి సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవి సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులకు తెరలేపుతూ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. ఇక సైరా చూసిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.

సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











