ముందే బుక్ చేసుకోండి.. ఆ తరువాత దొరకదు.. కృతి శెట్టిపై చిరు కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో.. ఆ మాటల ప్రవాహాం ఎలా ఉంటుందో మరోసారి ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా తెలిసివచ్చింది. స్టేజ్ ఎక్కి చిరు ప్రసంగం మొదలుపెట్టాక.. ఏ మ్యాటర్ లీక్ చేస్తాడా? అని అందరూ చెవులు రిక్కించి మరీ ఎదురుచూశారు. అనుకున్నట్టుగానే కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. తాను మైత్రీ మూవీస్ బ్యానర్‌లో బాబీ దర్శకుడిగా ఓ సినిమా చేయబోతోన్నానని ప్రకటించేశాడు. ఇలా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ హీరోయిన్ కృతి శెట్టి గురించి కూడా కామెంట్స్ చేశాడు.
Recommended Video

సినిమాపై చిరు ప్రశంసలు..
ఉప్పెన సినిమా చూశాను. అది చూశాక.. నాకు కలిగిన ఆనందం, అనుభూతులను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పాలని అనుకున్నాను. అంతటి గొప్ప సినిమాను మీరూ చూడాలని అనుకున్నాను. కానీ నా ఆత్రుతను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను.. ఇప్పుడు సినిమాలోని సీన్స్‌ను లీక్ చేయనంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.

మరో లెవెల్‌కు..
నటీనటులు విషయంలో ముందుగా చిరంజీవి విజయ్ సేతుపతిని ఆకాశానికెత్తేశాడు. విజయ్ సేతుపతి కావాలి అని బుచ్చిబాబు అడిగినప్పుడు అతను దొరుకుతాడా? అని అన్నాడు. అలా అతను ఒప్పుకోవడమే ఈ మూవీ మొదటి సక్సెస్. ఉప్పెనను విజయ్ సేతుపతి మరో లెవెల్‌కు తీసుకెళ్లాడంటూ చిరంజీవి ప్రశంసలు కురిపించాడు. ఆ తరువాత హీరోయిన్ గురించి చిరంజీవి మాట్లాడాడు.

మొదటి సినిమా అయినా..
మొదటి సినిమా అయినా కూడా కృతి శెట్టి అద్భుతంగా నటించింది. చివర్లో తండ్రితో వచ్చే సీన్స్‌లో ఆమె అద్భుతంగా ఎమోషన్స్ పండించింది. షో మొత్తాన్ని గ్రాబ్ చేసింది.. అందరినీ అలా కట్టిపడేస్తుంది. అయితే ఆ సీన్ ఏంటని అడగకండి.. లీక్ చేయను అంటూ చిరు కౌంటర్లు వేశాడు.

ఇప్పుడు బుక్ చేసుకోండి..
మొదటి సినిమానే అయినా అంత బాగా నటించిందంటే.. ఆమె గొప్ప నటి. ఇక్కడున్న నిర్మాతలకు చెబుతున్నా.. ఆమెను త్వరగా బుక్ చేసుకోండి.. తరువాత ఆమె మళ్లీ దొరకదు.. త్వరలోనే స్టార్ హీరోయిన్ అవుతుంది. ఇప్పటికే రెండు మూడు సినిమాలు కూడా చేస్తోన్నట్టు తెలిసిందంటూ కృతి శెట్టి గురించి చిరంజీవి చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











