గౌరవిస్తాడనుకుంటే అనుమానిస్తున్నాడు.. వయసు మీదపడిందని అనుకున్నాడేమో! చిరంజీవి షాకింగ్ కామెంట్స్

గౌరవిస్తాడనుకుంటే అవమానిస్తున్నాడు.. వయసు మీదపడిందని అనుకున్నాడేమో! అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ చిరంజీవి ఈ కామెంట్స్ ఎందుకు చేశారు? ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడారు? అసలిదంతా ఎక్కడ జరిగింది? వివరాల్లోకి పోతే..

చాలా రోజులుగా అనుకుంటున్నారు.. కానీ

చాలా రోజులుగా అనుకుంటున్నారు.. కానీ

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా రాబోతున్న సినిమా ‘అర్జున్ సురవరం'. ఈ సినిమా విడుదల కోసం కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అది విడుదలకు నోచుకోలేదు. చివరకు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఘనంగా మంగళవారం రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక.. చిరంజీవి హాజరై

ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక.. చిరంజీవి హాజరై

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరై సందడి చేశారు. అలాగే, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అతిథిగా హాజరయ్యారు. దీంతో ఈ వేడుక అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఈ ప్రోగ్రాంలో వేదికపై చిరంజీవి మాట్లాడిన తీరు వావ్! అనిపించింది.

యంగ్ హీరోపై చిరంజీవి కామెంట్స్

యంగ్ హీరోపై చిరంజీవి కామెంట్స్

ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ నిఖిల్‌పై కొన్ని కామెంట్స్ చేశారు. ‘‘నేను ముందుగా మాట్లాడాల్సిన వ్యక్తి.. ఇప్పటి వరకు ఎగ్టైట్‌మెంట్‌లో ఏదేదో మాట్లాడేశాడు'' అని చిరంజీవి అంటుండగానే.. ఆయన చెవిలో నిఖిల్ ఏదో చెప్పబోయాడు. దీంతో చిరంజీవి నవ్వుతూ.. ‘‘చూశారా! కంగారు, నాకేదో మతిమరుపు అనుకుని తన పేరు నా చెవిలో చెబుతున్నాడు. చూడండి అన్నారు. ఇక్కడ కూడా నన్ను గౌరవిస్తున్నాడు అనుకుంటే అనుమానిస్తున్నాడు అనేశారు.

వయసు మీదపడిందని అనుకున్నాడేమో!

వయసు మీదపడిందని అనుకున్నాడేమో!

వయసు మీదపడింది కదా నా పేరు మరిచిపోతాడని నిఖిల్ అనుకుంటున్నాడేమో. అతను జస్ట్ నిఖిల్ అని నా చెవిలో చెప్పాడు. కానీ అతని పేరు నిఖిల్ సిద్ధార్థ అని నాకు గుర్తు. ఏది కరెక్ట్ అంటూ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆసక్తికరంగా మాట్లాడారు చిరంజీవి. నిఖిల్‌ రూపంలో నాకు మరో తమ్ముడు, మరో శిష్యుడు దొరికాడని చాలా సంతోషంగా ఉందని చిరు పేర్కొనడం విశేషం.

నిఖిల్ కళ్ళలో కన్నీరు

నిఖిల్ కళ్ళలో కన్నీరు

ఇక తనకెంతో ఇష్టమైన హీరో, ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి తన సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా రావడం నిఖిల్‌ని భావోద్వేగానికి గురి చేసింది. చాలా ఎగ్టైట్‌మెంట్‌ అయిన నిఖిల్ కళ్ళలో ఆనంద భాష్పాలు కనిపించాయి. చిరంజీవి తన గురించి మాట్లాడేటప్పుడు నిఖిల్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

Recommended Video

#CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
అర్జున్ సురవరం మూవీ

అర్జున్ సురవరం మూవీ

నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన అర్జున్ సురవరం మూవీలో నిఖిల్ సిద్ధార్థ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. చిత్రానికి టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించగా, ‘ఠాగూర్' మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X