సైరా దిగాక రంగస్థలం రికార్డులు మటాష్.. అభిమానులతో మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం యూఎస్ వెళ్లిన సంగతి తెలిసిందే. చిరంజీవి అక్కడ అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమై వారితో ముచ్చటించారు. చిరంజీవి, ఎన్నారై అభిమానుల మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ఎన్నారై అభిమానులు రంగస్థలం చిత్ర ప్రస్తావన తీసుకుని వచ్చారు.
రంగస్థలం చిత్రం గురించి చిరు వారితో సరదాగా వ్యాఖ్యానించారు. రంగస్థలం చిత్రం నా ఖైదీ నెం 150 రికార్డులు బ్రేక్ చేసింది. అప్పటివరకు బాహుబలి తరువాత స్థానంలో ఉన్న ఖైదీ నెం 150 చిత్రాన్ని రంగస్థలం తక్కువ సమయంలోనే అధికమించిందని చిరంజీవి అన్నారు.

దీని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదని, సైరా చిత్రం విడుదలయ్యాక రంగస్థలం రికార్డులన్నీ చెరిగిపోతాయని చిరంజీవి సరదాగా వ్యాఖ్యానించారు. సైరా చిత్రం 150 కోట్ల భారీ బడ్జెట్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని సైరా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











