twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ సీఎం జగన్‌పై చిరంజీవి కామెంట్స్.. ఆ నమ్మకం, ఆశ నాలో ఉందంటూ!

    |

    Recommended Video

    Magastar Chiranjeevi Congratulated Ap Cm Ys Jagan || Filmibeat Telugu

    ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే వారిపై ఓ చట్టం అమల్లోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ అంశంపై స్పందించిన చిరంజీవి.. ఆ చట్టంపై, సీఎం జగన్‌పై ప్రశంసలు గుప్పించారు చిరంజీవి. వివరాల్లోకి పోతే..

    దిశ ఘటన.. ఉలిక్కిపడిన దేశం

    దిశ ఘటన.. ఉలిక్కిపడిన దేశం

    దేశవ్యాప్తంగా దిశ ఘటన కలకలం సృష్టించింది. ఓ యువ వైద్యురాలిని నాలుగు మానవ మృగాలు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం చూసి దేశం ఉలిక్కిపడింది. ఆ తర్వాత సదరు నిందితుల ఎన్‌కౌంటర్, జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం లాంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

    ఏపీ గవర్నమెంట్ కీలక నిర్ణయం.. మహిళల భద్రత

    ఏపీ గవర్నమెంట్ కీలక నిర్ణయం.. మహిళల భద్రత

    మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠిన శిక్ష విధించేలా కీలక నిర్ణయం తీసుకొని ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది ఏపీ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 పేరుతో రూపొందిన ఈ చట్టం.. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఆమోదం పొందింది. దీంతో మహిళల భద్రత కోసం ఏపీ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు స్వాగతిస్తున్నారు.

    మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్.. జగన్ గురించి

    మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్.. జగన్ గురించి

    ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 పై మెగాస్టార్ చిరంజీవి తన స్పందన తెలియజేస్తూ జగన్‌పై ప్రశంసలు గుప్పించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం అన్నారు. మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతోన్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత కల్పిస్తుందన్న నమ్మకం, ఆశ తనలో ఉందని పేర్కొన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో తొలి అడుగులు.. హర్షణీయం

    ఆంధ్రప్రదేశ్‌లో తొలి అడుగులు.. హర్షణీయం

    దిశ సంఘటన మన అందర్నీ కలిచివేసిందని, ఆ ఎమోషన్స్ తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయని అన్నారు. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం అందరిలో ఉందని, ఈ మేరకు అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్‌లో తొలి అడుగులు పడడం హర్షణీయచమని చిరంజీవి పేర్కొన్నారు.

    నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా..

    నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా..

    ఇప్పటి వరకు ఈ కేసుల్లో అమలు చేస్తున్న శిక్షల గురించి కూడా ప్రస్తావించిన చిరంజీవి.. సీఆర్పీసీని సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించడం, అదేవిధంగా ప్రత్యేక కోర్టులు ఇతర మౌళిక సదుపాయాల్ని కల్పించడంతో పాటు ఐపీసీ ద్వారా సోషల్ మీడియా ద్వారా మహిళల గౌరవాన్ని కించపరచడం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం, నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చిరు పేర్కొన్నారు.

    చిరు 152

    చిరు 152

    కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ప్రస్తుతం తన 152వ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

    English summary
    Yesterday (December 11) Ap Disha Act-2019 was activated. On this act Chiranjeevi reacted and commented Y. S. Jaganmohan Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X