తెలంగాణవాదుల దూకుడు తగ్గించుకోమన్న చిరు
మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'దూకుడు" సినిమా షూటింగుపై తెలంగాణవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. వికారాబాదులో 'దూకుడు' సినిమా షూటింగులో హీరో మహేష్ బాబుపై నిన్న జరిగిన తెలంగాణవాదుల దాడిని మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ఉద్యమాల పేరుతో కళాకారులను, షూటింగులను అడ్డుకోవడం దారుణమనీ, దురదృష్టమనీ ఆయన అన్నారు. తిరుపతిలో పత్రికల వారితో మాట్లాడుతూ చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. కళాకారులన్న వాళ్లు ప్రాంతాలకు అతీతులనీ, వారు అన్ని ప్రాంతాలకు చెందుతారనీ చిరంజీవి పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయనీ, ఈ నేపథ్యంలో షూటింగులకు భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











