పుట్టెడు దుఃఖంలో కృష్ణ, నరేష్.. మెగాస్టార్ ఓదార్పు.. విజయ నిర్మలకు చిరంజీవి నివాళి

Recommended Video

Telangana CM KCR, Megastar Chiranjeevi Condolences To Vijaya Nirmala Family || Filmibeat Telugu

సినీ నటి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మృతి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల గురువారం తెల్లవారు జామున హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించింది. విజయ నిర్మల మృతి చెందిందని తెలిసి షాకయ్యింది సినీ లోకం. ఆమె మృతి పట్ల పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు తమ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు

విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు

హాస్పిటల్‌లో మృతి చెందిన విజయ నిర్మల భౌతిక కాయాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసంలో ఉంచారు. ఈ మేరకు యావత్ టాలీవుడ్ నటీనటులతో పాటు రాజకీయ పెద్దలు సైతం ఆమె పార్దీవ దేశాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఘన నివాళి

మెగాస్టార్ చిరంజీవి ఘన నివాళి

గురువారం సాయంత్రం నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసంలో ఉంచిన విజయ నిర్మల పార్దీవ దేహాన్ని సందర్శించారు మెగాస్టార్ చిరంజీవి. విజయ నిర్మలను చూస్తూ ఎంతో భావేద్వేగం చెందిన ఆయన ఆమె భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించారు. అనంతరం విజయనిర్మల కుటుంబ సభ్యులను ఓదార్చారు చిరు.

చిరు సంతాపం.. కృష్ణ, నరేష్‌లను ఓదార్చుతూ

చిరు సంతాపం.. కృష్ణ, నరేష్‌లను ఓదార్చుతూ

పుట్టెడు దుఃఖంలో ఉన్న కృష్ణ, నరేష్‌లను చిరంజీవి ఓదార్చారు. కాసేపు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అరుదైన నటి, దర్శకురాలు విజయనిర్మల హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చిరు పేర్కొన్నారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా అత్యంత ప్రతిభా పాటవాలను విజయనిర్మల చాటారన్నారు. ఇంతటి ప్రతిభావంతురాలిని ఇప్పటిలో ఇంకెవరినీ చూడలేమని చిరంజీవి తన సంతాప సందేశంలో వెల్లడించారు.

భారీ అంతిమయాత్ర.. ఏర్పాట్లు పూర్తి

భారీ అంతిమయాత్ర.. ఏర్పాట్లు పూర్తి

విజయ నిర్మల అంత్యక్రియలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరులోని ఆమె ఫామ్ హౌస్‌లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నానక్‌ రామ్ గూడ నుండి విజయ నిర్మల అంతిమయాత్ర మొదలై మధ్యాహ్నం 12 గంటలకు చిలుకూరు ఫామ్ హౌస్‌కు చేరుకోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X