లగే రహో మెగాస్టార్‌

By Staff

ఏమని పిలవాలి చిరంజీవిని? ఆయన అభిమానులు ఆయనను ఎలాగైనా ప్రేమగా పిలుచుకోవచ్చు. కానీ తనను అంతా ఎలా పిలవాలని చిరంజీవి అభిలషిస్తారు? ఇదే ప్రశ్నను ఆయన ముందు ఉంచినప్పుడు చిరంజీవి తమ సహజమైన శైలిలో గంభీరంగా నవ్వేస్తూ - మన చిరంజీవి అని ప్రేక్షకులు అనుకుంటే చాలు, మిగతావన్నీ విశేషణాలే.. అని సింపుల్‌గా తేల్చేశారు.

ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది, ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయమే చిరంజీవికి గౌరవ డాక్టరేట్‌ ప్రకటించినప్పుడు - ఆ సంతోషాన్ని మీడియాతో, తద్వారా అశేష అభిమానులతో పంచుకోడానికి మెగాస్టార్‌ చిరంజీవి విలేఖరులను పిలిపించారు.

ఈ సంవత్సరం నాకు బాగానే ఉంది. ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్‌ అవార్డు లభించింది. ఇప్పుడు ఆంధ్రా యూనివర్సిటీ వారి గౌరవ డాక్టరేట్‌ వరించింది. ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు కానీ ఆ నానుడి నా విషయంలో రివర్స్‌లో పనిచేస్తోందనిపిస్తోంది. కాస్త ఆలస్యం అయినా ఆంధ్రా యూనివర్సిటీ వారి డాక్టరేట్‌ లభించడం చాలా సంతోషం కలిగిస్తోంది అన్నారు చిరంజీవి.

సినిమా రంగంలో పోషిస్తున్న విభిన్నమైన పాత్రలతో పాటు సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాలకు కూడా గుర్తింపు పెరుగుతోంది. మరి మీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరిచే అవకాశం ఉందా? అని అడిగినప్పుడు యస్‌ అన్నారు.

నేత్రదానం, రక్తదానంతో పాటు హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ వ్యాప్తి కాకుండా చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు ట్రస్ట్‌ ద్వారా చేపడుతున్నాం. అలాగే, మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మంచినీటి సరఫరా ఉండాలన్న కల సాకారానికి కృషి చేయబోతున్నాను అని చెప్పారు.

రాజకీయాలలోకి వస్తే ప్రజలకు మరిన్ని సేవలు అందించే అవకాశం ఉంటుంది కదా అన్న ప్రశ్నకు - ప్రస్తుతానికి నాకు రాజకీయాలలోకి రావలసిన అవసరం అంతగా కనిపించడం లేదండి అని చెప్పారు.

తదుపరి చిత్రాల గురించి ప్రస్తావించినప్పుడు - లగే రహో మున్నాభాయ్‌ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈ మధ్య సందేశాత్మకమైన చిత్రాలు చేస్తున్నాను. గాంధేయవాదం అంటే చాలా యిష్టం నాకు. ఈ సినిమా చేస్తే నన్ను గాంధేయవాదిగానే అంతా ట్రీట్‌ చేయచ్చు కూడా. కానీ సమస్య ఏంటంటే.. ఈ సినిమా దక్షిణాది రీమేక్‌ రైట్స్‌ని నిర్మాతలు చాలా డబ్బు పోసి కొన్నారు. దీనిని నేను ఖండించాను. మీడియాలో నా అభిప్రాయాలు గురించి తెలుసుకుని లగే రహో నిర్మాతలు రీమేక్‌ రైట్స్‌ ధర తగ్గించేందుకు సుముఖంగా ఉన్నారని తెలిసింది. అదే జరిగితే.. నేను ఆ సినిమా చేయచ్చు.. చూద్దాం.. అని ముగించారు మెగాస్టార్‌.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X