డబ్బులడిగిన చిరంజీవి, అంతా నవ్వారు!

By Bojja Kumar

హైదరాబాద్: నాగార్జున హోస్ట్ చేస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఫస్ట్ సీజన్ నిన్న ముగిసింది. మెగా స్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి ఏం మాట్లాడతారో అని అంతా ఆశగా ఎదురు చూసారు. అయితే చిరంజీవి అభిమానులు ఊహించినట్లు అక్కడ ఏమీ జరుగలేదు.

ఇప్పటి వరకు జరిగిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఎపిసోడ్ల రివ్యూలాగా ఈ కార్యక్రమం సాగింది. రాజకీయాల గురించిగానీ, సినిమాల గురించిగానీ ఇక్క ప్రస్తావన రాలేదు. చిరంజీవి మాట్లాడుతూ ఈ షో ఎంతో మంది సామాన్యుల కలలను నెరవేర్చే విధంగా ఉందని ప్రశంసించారు. ఫస్ట్ సీజన్ ముగియడం అంటే శుభం కార్డు పడటం కాదని, సెకండ్ సీజన్ మొదలవ్వడానికి ఈ గ్యాప్ ఇంటర్వెల్ లాంటిదని తెలిపారు.

ఇక తన గురించి మాట్లాడుతూ....తాను ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ జీవితంలో ముందుకు సాగానని, ఆఫ్ ది స్క్రీన్, ఆన్ ది స్క్రీన్ బెస్ట్ బిహేవియర్ తో ఉండటానికి ప్రయత్నించానని, ప్రేక్షకులు, పరిశ్రమలోని అందరి మన్ననలు ఉండటం వల్లనే తాను ఈ స్థాయికి వచ్చానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Chiranjeevi confirms 150th film

తన 150వ సినిమాగురించి మాట్లాడుతూ....ఈ సంవత్సరం 150వ సినిమాలో మాట్లాడుతానని తెలిపారు. షో చివరలో చిరంజీవి నాగార్జునను డబ్బులు అడగటం....ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించింది.

తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ షోను అద్భుతంగా నడిపిస్తున్న అక్కినేని నాగార్జునతో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిథిగా 40వ ఎపిసోడ్ గ్రాండ్ గా సాగింది.

ఈ ఇద్దరు స్టార్స్ తెలుగు టెలివిజన్ తెరపై కలిసి కనిపించడం చాలా అరుదు. వీరిద్దరూ పాల్గొన్న ఆ అపురూప సందర్భం 'మీలో ఎవరు కోటీశ్వరు' 40వ ఎపిసోడ్ లో ప్రేక్షకులు అనుభూతి చెందారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఫస్ట్ సీజన్ ఈ అద్భుతమైన కలయికతో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఆదరించి ఆశీర్వదించిన ప్రేక్షకుల కోసం సెకండ్ సీజన్ త్వరలోనే ప్రారంభమవుతుందని 'మీలో ఎవరు కోటీశ్వరుడు' వాద్దానం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X