»   » హాలీవుడ్‌కి ధీటుగా ఉంది: ‘కంచె’పై చిరంజీవి ప్రశంసలు (ఫోటోస్)

హాలీవుడ్‌కి ధీటుగా ఉంది: ‘కంచె’పై చిరంజీవి ప్రశంసలు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కంచె'. దసరా కానుకగా ఈ నెల 22న విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘కంచె'పై ప్రశంసల వర్షం కురిపించారు.

దర్శకుడు గురించి చిరంజీవి మాట్లాడుతూ ‘నేను నిన్న కంచె సినిమాను చూశాను. ఈ టీమ్ ను అభినందించ‌కుండా ఉండలేక‌పోతున్నా. వ‌రుణ్‌కి, క్రిష్‌కి ఫోన్ చేసి అభినందించాను. ఫోన్ చేసి పిలిపించాను. క్రిష్ మామూలుగా చాలా మంచి సినిమాలు తీస్తారు. ఈ సినిమాను ప్ర‌యోగాత్మ‌క సినిమా అని అన‌డానికి వీల్లేదు. క‌మ‌ర్షియ‌ల్‌తో కూడిన అంద‌మైన ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మిది. ఇలాంటి సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాలి. అభినందించాలి' అన్నారు.

వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ...1930 బ్యాక్‌డ్రాప్ విలేజ్ కుర్రాడిగా, వారియ‌ర్‌గా వ‌రుణ్ తేజ్ చాలా బాగా చేశాడు. వార్ సీన్ల‌ను జార్జియాలో తీశారు. హాలీవుడ్ సినిమా స్థాయికి ఏమాత్రం తీసిపోని సినిమా ఇది. 55 రోజుల్లో ఈ సినిమాను తీశార‌ని తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోయా. ఇప్పుడిప్పుడే ప‌రిశ్ర‌మ‌కు వ‌స్తున్న వ‌రుణ్‌లో ఇంత‌టి ప‌రిప‌క్వ‌త చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. త‌న‌కు తానుగా త‌న‌ను మ‌ల‌చుకున్నాడు. సాయిమాధ‌వ్ బుర్రా రాసిన డైలాగులు నాకు గుర్తుండిపోయాయి' అని చెప్పారు.

గర్వంగా ఉందన్న చిరు

గర్వంగా ఉందన్న చిరు


మా అబ్బాయి వరుణ్ తేజ్ చాలా బాగా చేసాడు, తండ్రి గా నేను ఎంతో గర్వ పడుతున్నాను అంటూ చిరంజీవి వరుణ్ తేజ్ ను ప్రశంసించారు.

క్రిష్

క్రిష్


ఇవాళ మా నాన్న‌గారి పుట్టిన‌రోజు. ఇలా చిరంజీవిగారు పిలిచార‌ని చెప్పాను. ఆయ‌న న‌న్ను కౌగ‌లించుకున్నారు. నేను వేదం తీసిన‌ప్పుడు కూడా ఆయ‌న అంత‌గా ఆనందించ‌లేదు. ఇవాళ చాలా ఆనందించారు. ఈ సినిమాను అమ్మ, నాన్న‌, గురువు, దైవం, పుడ‌మి, పుస్త‌కానికి అంకిత‌మిచ్చాను. నా త‌దుప‌రి సినిమాల‌ను ప్రేక్ష దేవుళ్ళ‌కు అంకిత‌మిస్తాను. చిరంజీవిగారు ఇలా ఇంటికి పిలిచి అభినందించ‌డం నా జ్ఞాప‌కాల భాండాగారంలో తీపి గుర్తు అన్నారు.

ఈ సమావేశంలో...

ఈ సమావేశంలో...


ఈ మీడియా సమావేశంలో చిరంజీవితో పాటు మెగా బ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్, దర్శకుడు క్రిష్, సాయిమాధ‌వ్ బుర్రా పాల్గొన్నారు.

కంచె

కంచె


వ‌రుణ్ తేజ్‌, ప్ర‌గ్యా జైశ్వాల్ జంట‌గా క్రిష్ తెర‌కెక్కించిన ఈ సినిమాను జాగ‌ర్ల‌మూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు.

English summary
Mega star Chiranjeevi congratulates Kanche movie team.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu