వకీల్ సాబ్ దర్శకుడు, నిర్మాతకు చిరంజీవి సత్కారం: ఏకంగా ఇంటికి పిలిచి మరీ అభినందన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత చేసిన చిత్రం 'వకీల్ సాబ్'. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దీనిని రూపొందించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక, ఈ సినిమాను శుక్రవారం రాత్రి మెగా ఫ్యామిలీ మొత్తం వీక్షించింది. హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, తల్లి అంజనాదేవి కలిసి చూశారు. వీళ్లతో పాటు మెగా బ్రదర్ నాగబాబు.. ఆయన సతీమణి, హీరో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా ఈ చిత్రాన్ని తిలకించారు. ఆ తర్వాత దీనిపై స్పెషల్ ట్వీట్లు కూడా చేశారు.

'వకీల్ సాబ్' సినిమాను చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. తన సోదరుడు పవన్ కల్యాణ్‌‌తో పాటు మిగిలిన నటీనటులు, టెక్నీషియన్లు ట్విట్టర్ వేదికగా అభినందించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్‌తో పాటు నిర్మాత దిల్ రాజును తన ఇంటికి పిలిచారు. అంతేకాదు, వాళ్లిద్దరికీ పుష్ప గుచ్చాలు ఇచ్చి సినిమా విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్లు కూడా సినిమా చూసినందుకు గానూ చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi Congratulates producer Dil Raju and director Sriram Venu

'వకీల్ సాబ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్‌ను దక్కించుకోవడంతో పాటు రూ. 50 కోట్ల పైచిలుకు కలెక్షన్లను వసూలు చేసి సత్తా చాటింది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. మరీ ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో 'బాహుబలి' రికార్డులకు కూడా బ్రేక్ చేసింది. ఈ సినిమా విజయంతో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X