మీడియాకు చిరంజీవి కౌంటర్.. మళ్లీ అలా రాయరుగా అంటూ...
మెగాస్టార్ చిరంజీవి సామాజిక సేవలోనూ ముందుంటారనే విషయం తెలిసిందే. ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ద్వారా ఎంతో మంది పేదలకు సాయం అందించారు. అలాగే కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ తో పాటు వ్యక్తిగతంగా కోట్లలో విరాళం ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. తాజాగా స్టార్ క్యాన్సర్ సెంటర్ తో కలిసి చిరంజీవి ఛారిటబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే...
క్యాన్సర్ రోగుల కోసం ముందుకొచ్చిన చిరంజీవి:చిరంజీవి కొన్ని రోజులు క్రిందట ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. క్యాన్సర్ పై అవగాహన లేక చాలామంది ప్రమాదం బారిన పడుతున్నారన్న చిరంజీవి... దానిని ముందుగా గుర్తించాలన్నా ఏ టెస్టులు చేయించుకోవాలో తెలియని వారు చాలామంది ఉన్నారని వెల్లడించారు. వారందరి కోసం తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షల నిర్వహిస్తామని, వాటికి అయ్యే ఖర్చులు తానూ భరిస్తాను అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ క్యాన్సర్ టెస్ట్ క్యాంప్ సెంటర్స్ గురించి చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ గోపీచంద్ సంయుక్తంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగాస్టార్:ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. జులై 9న హైదరాబాద్, జులై 16న వైజాగ్, జులై 23న కరీంనగర్‌లో రోజుకు వెయ్యి మంది చొప్పున వివిధ క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తాం. అభిమానులు, సినీ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఉచిత వైద్య పరీక్షలు చేయడమే కాదు, చికిత్సకు అయ్యే ఖర్చు విషయంలోనూ కొంత భరిస్తాం. అయితే, ఎంత మొత్తం అనేది ఇప్పుడే చెప్పలేం.. మరొకసారి వైద్యులతో మాట్లాడి చెబుతాను. సినీ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని, దాని ద్వారా వాళ్లు భవిష్యత్‌లోనూ చికిత్సలు చేయించుకోవచ్చు అని చెప్పుకొచ్చారు.

మీడియాకు చిరంజీవి కౌంటర్:ఇటీవల క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిరంజీవి.. క్యాన్సర్ వ్యాధిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే మీడియా మాత్రం చిరంజీవి క్యాన్సర్ బారిన పడినట్లు వార్తలు రాసుకొచ్చారు. ఇది చూసిన చిరు.. వెంటనే ఆ వార్తలపై స్పందించారు. తాను క్యాన్సర్ బారిన పడలేదంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి మరోసారి మీడియాకు కౌంటర్ వేశారు. మళ్లీ అలా రాయొద్దు అంటూ సూచించారు.

భోళా శంకరుడు వచ్చేస్తున్నాడు..:ప్రస్తుతం చిరంజీవి.. భోళా శంకర్ సినిమాతో బిజీగా గడపుతున్నాడు. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు రీమేక్ గా తెరకెక్కుతోంది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహర్ రమేష్ దర్శకుడిగా వ్యవహారిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి విడుదల అయిన సాంగ్స్, పోస్టర్స్ కు విశేష స్పందన వస్తోంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జూన్ 24 సాయంత్రం 4 గంటల నుంచి జరగనుంది. హైదరాబాద్‍లోని సంధ్యా 70ఎంఎం థియేటర్లో ఈ ఈవెంట్ జరగనుంది.


Click it and Unblock the Notifications











