మోహన్ బాబుకు చిరు కౌంటర్...అక్కినేని పంచ్

By Bojja Kumar

ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు 75 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ ఏఎన్ఆర్, మోహన్ బాబు, చిరంజీవిల మధ్య కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసకున్నాయి.

మోహన్ బాబు మాట్లాడుతూ...'ప్రేమాభిషేకం సినిమా షూటింగ్ సమయంలో అన్నపూర్ణమ్మగారిని కలిసినప్పుడు ఆమె నాతో ఇలా అన్నారు. నువ్వు ఏఎన్ఆర్ కంటే గొప్ప నటుడివి, ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ డైలాగులు చెప్పే సత్తా నీకు మాత్రమే ఉంది, నేను చెప్పేది నిజం మీరు చప్పట్లు కొట్టాలి(ప్రేక్షకులను)' అంటూ వ్యాఖ్యానించారు.

అనంతరం అక్కినేని మాట్లాడుతూ....'ఇంతకు ముందు మోహన్ బాబు మాట్లాడారు. నాకంటే గొప్పనటుడువి నువ్వే అని నా భార్య ఆయనతో చెప్పిందట, సాక్ష్యం చెప్పడానికి ఆమె ఇప్పుడు లేదు. ఆయన్ను అలా అనుకోనివ్వండి. మనల్ని చూసి అనేక మంది ఈర్ష్య పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లు(మెహన్ బాబు) ఉంటేనే మన గొప్పతనం బయట పడుతుంది' అంటూ పంచ్ ఇచ్చారు.

మధ్యలో చిరంజీవి కల్పించుకుని....'నాగేశ్వరరావు గారు మంచి మానసిక విశ్లేషకులు, ఆయన తప్పులు, లోటుపాట్లను బాగా అంచనా వేస్తారు. నాతో ఒకసారి ఆయన స్వయంగా మాట్లాడుతూ...రామారావు నాకంటే అందగాడు, ఆజాను బాహుడు, పౌరాణిక పాత్రలు బాగా వేస్తారు, గంభీరమైన స్వరం, ఆయనతో పొల్చుకుంటే పర్సనాలిటీ, ముఖ వర్చస్సు పరంగా ఆయనతో పోటీ పడలేని తత్వం నాది..అని చెప్పారు. ఆయన అలా తన లోటుపాట్లను అంచనా వేసుకుని ఆయనకు తగిన పాత్రలతో రామరావుగారికి పోటా పోటీగా రాణించారు. మోహన్ బాబును గొప్ప నటుడివి అని అన్నపూర్ణమ్మ పొగడటం అంటే బిడ్డను పొగిడినట్లే, నాగార్జునను బాగా నటించావు అంటే నాన్నకంటే బాగా చేశావు అని కాదు అక్కడ అర్థం' అంటూ మోహన్ బాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు చిరంజీవి.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...నాగేశ్వరరావు మోహన్ బాబుకు పంచ్ ఇస్తున్న సమయంలో, ఆయన్ను నిలువరించడానికి మోహన్ బాబు అక్కినేనికి పాదాభివందం చేస్తుండగా చిరంజీవి మధ్యంలో కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వు ఎందుకు ఆపుతావ్ అంటూ అడ్డు పడటం గమనార్హం. చిరంజీవి మోహన్ బాబు గురించి మాట్లాడుతుంటే నాగురించి మాట్లాడటం ఆపవయ్యా అన్నచందంగా మోహన్ బాబు చిరుకు అడ్డు పడటం కూడా ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X