68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా విశ్వంభర. బింబిసారతో భారీ విజయాన్నిఅందుకున్న వశిష్ట మల్లిడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీని ప్రాణం పెట్టి చేస్తున్నారట చిరంజీవి. షూటింగ్ లో భాగంగా ఆయన ఓ గొప్ప సాహసం చేశారనే న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి ఆ సాహసం ఏంటనేది చూద్దామా..
భారీ రేంజ్‌లో విశ్వంభర:యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి సహా పలువురు యంగ్ బ్యూటీలు ఈ సినిమాలో భాగమవుతున్నారు. రావు రమేష్, హీరోయిన్ అంజలి కూడా నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్:ప్రస్తుతం ఈ సినిమాలోని హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. a ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో చిత్ర యూనిట్ వద్దని చెబుతున్నా వినకుండా డూప్ లేకుండా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ చేశారట చిరంజీవి. 68 ఏళ్ల వయసులో కూడా తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరించారట చిరు.
చిరంజీవి సాహసం:కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలకు డూప్ ఉపయోగించమని మేకర్స్ చెప్పినప్పటికీ చిరంజీవి ఒప్పుకోలేదట. ఎంతో సాహసంగా వెళ్లి ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో నటించారట చిరు. షూటింగ్‌లో మెగాస్టార్ తీరు, ఆయన డెడికేషన్ చూసి విశ్వంభర యూనిట్ బిత్తరపోయిందట. ఈ విషయాలను ఓ యూనిట్ సభ్యుడు లీక్ చేశాడు.

మెగా ఫ్యాన్స్ ఖుషీ:విశ్వంభర చిత్రానికి సంబంధించి తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దటీజ్ మెగాస్టార్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉంటాయని తెలుస్తుండటం భారీ హైప్ తీసుకొచ్చింది. అశేష మెగా లోకం ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











