శ్రీజను దుబాయ్ పంపించేస్తున్న చిరంజీవి...!
ప్రేమించి పెళ్లి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజకు ఇపుడు మానసిక ప్రశాంతత కావాలట. ఇందుకోసం ఆమె దుబాయ్‌కు వెళ్లనున్నారు. ఇటీవల తన భర్తతో వచ్చిన మనస్పర్ధల కారణంగా పుట్టింటికి వచ్చిన శ్రీజ.. భర్తతో పూర్తిగా తెగ తెంపులు చేసుకునేందుకు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇప్పుడు అమ్మనాన్నలతోనే ఉంటోంది.
కాగా మానసిక ప్రశాంతత కోసం చదువుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ నిర్ణయించుకుంది. ఉన్నత చదువులకు వారం రోజుల్లో దుబాయ్ వెళ్లనుంది. భర్త శిరీష్‌తో గొడవలు, విడాకుల కోసం కేసు నడుస్తుండటంతో ఈ జంజాటం నుంచి బయటపడాలని ఆమె యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు చిరు దుబాయ్ యూనివర్సిటీలో సీటు ఖరారు చేయించినట్లు తెలిసింది. అయితే శ్రీజ కుమార్తెను ఎక్కడ ఉంచాలనే విషయంపై కుటుంబసభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. దుబాయ్ పంపించాలా లేక ఇక్కడే ఉంచాలా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











