చిరంజీవి డైరెక్షన్ అంటూ ప్రచారం, అంత సీన్ ఉందా?
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత సంవత్సరకాలంగా హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో అంటూ అభిమానులను ఊరిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు దర్శకడు ఎవరనే విషయం ఖరారు కాలేదు. కథ కూడా ఏదనేది ఇంకా ఫైనల్ కాలేదు.
చిరంజీవి సినిమా గురించి ఇప్పటి వరకు వివిధ రకాల వార్తలు వినీ వినీ అభిమానులు విసిగిపోయారు. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. తన 150వ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించబోతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారబోతున్నాడట.
వినడానికి ఈ వార్త అసలు నమ్మబుద్ది కావడం లేదు. అసలు దర్శకత్వంలో అనుభవం లేని చిరంజీవి తను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న 150వ సినిమా విషయంలో ప్రయోగాలు చేస్తారని ఊహించడం లేదని అభిమానులు అంటున్నారు. మరి చిరంజీవి దర్శకత్వం వహిస్తారనే వార్తల్లో నిజానిజాలపై రామ్ చరణ్ గానీ, చిరంజీవి గానీ స్పందించాల్సి ఉంది.

150వ సినిమా
కాంగ్రెస్ పార్టీ ఓటమితో ప్రస్తుతానికి పొలిటికల్ టెన్షన్స్ ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నచిరంజీవి తన 150వ సినిమాపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా 150వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాటపడుతున్నారు.

రామ్ చరణ్
ప్రతిష్టాత్మక సినిమా చిరంజీవి కెరీర్లో అంత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు కావడతో ఈచిత్రం నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ దగ్గరుండి చూసుకోబోతున్నారు. చిరంజీవి భార్య సురేఖ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

కమర్షియల్ సినిమానే
చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందేశాత్మక అంశాల జోలికి పెద్దగా వెళ్లకుండా వినోదత్మకంగా, కమర్షియల్ అంశాలతో ప్లాన్ చేస్తున్నారు.

త్వరలో...
చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన వివరాలు నవంబర్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











