మెగాస్టార్ ‘చిరు’ దర్శకత్వంలో ఆ ముగ్గురు స్టార్లలో ఎవరు హీరో.....!?
ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత సినిమాలకు దాదాపు పూర్తిగా దూరమైపోయిన మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిపారు. గురువారం అసెంబ్లీ హాలులో మంత్రి గీతారెడ్డితో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మెగాస్టార్ ఏ హీరోను డైరెక్ట్ చేస్తారన్న దానిపై టాలీవుడ్‌లో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన తన కుమారుడు రామ్‌చరణ్, తమ్ముడు పవన్ కళ్యాన్ కాకుండా మేనల్లుడు అల్లు అర్జున్ హీరోగా సినిమా రూపొందించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదిలావుంటే మెగాస్టార్ దర్శకత్వ శాఖలోకి రాబోతున్నట్లు ప్రకటించడంతో ఇక ఆయన నటించే అవకాశం లేనట్లేనని కొందరు చెపుతున్నారు. అయితే ఆయనకోసమే ఓ సబ్జెక్టును సిద్ధం చేసుకున్నట్లు కోడి రామకృష్ణ, కృష్ణ వంశీ ఇప్పటికే చెప్పారు కూడా. మరి మెగాస్టార్ నటించి దర్శకత్వం వహిస్తారో...లేదంటే స్వర్గీయ ఎన్టీఆర్‌లా ఆయనే హీరోగా రూపొందించే చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











