అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి

సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో తెలిసిన హీరోలు చాలా అరుదుగా ఉంటారు. యంగ్ హీరోలు సోషల్ మీడియాను ఆడుకోవడం మామూలే. కానీ చిరంజీవి లాంటి హీరో సోషల్ మీడియాను దడదడలాడిస్తున్నాడు. ఆయన దెబ్బకు ఎవ్వరూ మిగలడం లేదు. ఇక ఇప్పుడు ఏకంగా మీమ్స్, ట్రోల్స్ క్రియేట్ చేసే పేజీలకు కూడా పని లేకుండా చేసేస్తున్నాడు. అందరి పని చిరంజీవే చేస్తున్నాడు. చిరంజీవి తాజాగా చేసిన పోస్ట్‌తో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాను రఫ్పాడించాడు..

సోషల్ మీడియాను రఫ్పాడించాడు..

మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఏంటో ఇన్నాళ్లు కేవలం వెండితెరపైనే అందరూ చూశారు. కానీ రియల్ లైఫ్‌లో అంతకు మించి అనేలా ఉంటాడని ఈ మధ్యే అందరికీ తెలిసి వచ్చింది. గతేడాది ఉగాది సందర్భంగా ట్విట్టర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి. వచ్చీ రాగానే అందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. టాలీవుడ్ హీరోలు, దర్శకులు పంచ్‌ల మీద పంచ్‌లు ఇచ్చాడు.

 లీకుల్లో స్పెషల్..

లీకుల్లో స్పెషల్..

మెగాస్టార్ చిరంజీవి లీకులు బయట పెట్టడంతో ఎంతో ముందుంటాడు. కావాలని లీక్ చేయడు. కానీ ఆ ఆత్రుత, ఉత్సాహం, ఆనందంలో లీక్ అవుతుంటాయి. అలానే రంగస్థలం ట్విస్ట్, ఆచార్య సినిమా టైటిల్ ఇలా అన్నీ కూడా ముందే బయటకు వచ్చాయి. అలా చిరు స్టేజ్ ఎక్కితే ఏది లీకవుతుందా? అని అందరూ ఎదురుచూస్తుంటారు.

కొరటాల, ఆచార్యపై మీమ్స్...

కొరటాల, ఆచార్యపై మీమ్స్...

చిరంజీవి అలా నోరు జారడం, కొరటాలకు తల నొప్పిగా మారడం వంటి వాటిపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ జరుగుతుంటాయి. అలా తమ మీద వచ్చే ట్రోల్స్,మీమ్స్‌ను ఇప్పుడు చిరంజీవి వాడేశాడు. ఇలా మీమ్ రూపంలో కొరటాలను బెదిరిస్తున్నట్టుగా ఆచార్య అప్డేట్‌ను ఇచ్చాడు.

బెదిరిస్తోన్న చిరంజీవి..

బెదిరిస్తోన్న చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టీజర్ అప్డేట్‌పై కొరటాలను మందలిస్తున్నట్టుగా మీమ్ షేర్ చేశాడు. ఇందులో తనకు కొరటాల మధ్య సంభాషణను చిరంజీవి క్రియేటివ్‌గా ఎడిట్ చేశాడు. ఏమయ్యా కొరటాల ఆచార్య టీజర్ న్యూ ఇయర్‌కి లేదు.. సంక్రాంతికి లేదు.. ఇంకెప్పుడు అని కొరటాలను హెచ్చరించినట్టుగా చూపించాడు.

Recommended Video

Ravi Teja : Actor Who Redefined Hardwork After Megastar Chiranjeevi | Filmibeat Telugu
రేపు పది గంటలకు..

రేపు పది గంటలకు..

సర్ అదే పనిలో ఉన్నా.. అని కొరటాల భయపడుతూ చెప్పినట్టుగా ఉన్నాడు.. ఇప్పుడు చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా అని చిరు కౌంటర్ వేశాడు. రేపు మార్నింగే అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తా సర్ అని కొరటాల కాస్త బెరుగ్గా సమాధానం ఇచ్చినట్టున్నాడు. ఇస్తావ్ గా అని మరోసారి చిరంజీవి గదమాయించాడు.. అనౌన్స్ మెంట్ రేపు మార్నింగ్ పది గంటలకు ఫిక్స్ సర్ అంటూ ఆచార్య టీజర్ గురించి చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X