ఏకంగా రెండు మల్టీస్టారర్లు: దూకుడు చూపిస్తోన్న చిరంజీవి.. మెగా ఫ్యాన్స్‌కు పండుగే.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా చాలా కాలం పాటు వెలుగు వెలిగారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన.. కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఫలితంగా అనతి కాలంలోనే స్టార్ హీరో అయిపోయారు. దీంతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన.. కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సారి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరు వరుసగా రెండు మల్టీస్టారర్ మూవీలు చేస్తున్నారు.

రైతు సమస్యలపై పోరాటం.. సక్సెస్ అయింది
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి' రీమేక్ ‘ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘమైన గ్యాప్ వచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. రైతు సమస్యలపై తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం నిరాశ పరిచింది.

మరోసారి పోరాటం చేస్తున్న మెగాస్టార్
టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాటం చేసే వ్యక్తిగా ఇందులో ఆయన నటిస్తున్నారు. రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.

రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న చిరంజీవి
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ‘ఆచార్య'లో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర కథను మలుపు తిప్పుతుందని అంటున్నారు. చరణ్ చేసే పాత్ర వల్లే చిరంజీవి స్ఫూర్తి పొందుతాడని తెలిసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఇది చూపిస్తారని సమాచారం

చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్ కీ రోల్
‘ఆచార్య' తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్' రీమేక్‌లో నటిస్తున్నారు. దీనిని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించనున్నాడు. ఒరిజినల్ మూవీలో మోహన్ లాల్ చేసిన పాత్రను చిరంజీవి చేస్తుండగా... పృథ్వీ రాజ్ చేసిన పాత్రను అల్లు అర్జున్ పోషిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఈ వార్తలో నిజం లేదని మెగా కాంపౌండ్ నుంచి సమాచారం అందుతోంది.
Recommended Video

అది కూడా భారీ మల్టీ స్టారర్ మూవీనే
‘లూసిఫర్' రీమేక్‌లో అల్లు అర్జున్ చేసినా చేయకపోయినా... అత్యంత కీలకమైన పృథ్వీ రాజ్ పాత్రను వేరే ఏ హీరో అయినా చేయాల్సి ఉంటుంది. ప్రాముఖ్యం ఉన్న పాత్ర కావడంతో మెగా కాంపౌండ్‌లోని హీరోనే తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ కానీ, సాయి ధరమ్ తేజ్ కానీ ఈ రోల్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


Click it and Unblock the Notifications











