తెలుగుదేశం పార్టీలో ఇటీవల చిరంజీవి డూప్ చేరారు. ఇది కోవర్ట్ ఆపరేషన్ కాదు. రాజ్ కుమార్ అనే నటుడు మీకు గుర్తుండే ఉంటాడు. కొంచెం పొట్టిగా ఉన్నా చిరంజీవి పోలికలతో ఉంటాడు. చిరంజీవి సినిమాల్లో డూప్ గా ఉండేవాడు. అతగాడిని మురళీమోహన్ సంప్రదించి తెలుగుదేశం పార్టీలో చేర్పించాడు. సినిమాల్లో చిరంజీవి డూప్ గా, టీవీ సీరియళ్ళలో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించిన రాజ్ కుమార్ కు ఏ హామీలిచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చారో తెలియడం లేదు.