‘ఫులి’ పై మెగాస్టార్ హ్యాండ్ చూడు ఎంత రఫ్ గా వుందో రఫ్ ఆడిచ్చేస్తా..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం కొమరం పులి రేపు విడుదల కాబోతోంది. సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం కొమరం పులి. కాగా ఈ చిత్రం ఎడిటింగ్ దశలో ఉండగా 'అన్నయ్య' మెగాస్టార్ కు 'తమ్ముడు' పవన్ కల్యాణ్ చిత్రాన్ని చూపించాడట. సినిమా చూసిన చిరు...కొన్ని కత్తిరింపులు, కొన్ని ప్లస్ లు చేయాలని సూచనలు చేశాడట. ఎందుకిలా..? అని ఆరా తీస్తే..
మగధీర సినిమా టైంలోనూ, రాజమౌళి ఇలాగే మెగాకు సినిమా చూపించాడట. సినిమా చూసిన మెగా, ప్రేక్షకులను ఆకట్టుకునే సీన్లు ఏవో, నచ్చని సన్నివేశాలు ఎటువంటివో వివరించి వాటిని చిత్రం నుంచి తొలగించేశాడట. మగధీరలో చిరు ఎడిటింగ్ బాగా వర్కవుట్ కావడంతో ఇపుడు తమ్ముడు కూడా అన్నయ్యను అర్థించినట్లు భోగట్టా. మరి అన్ని హంగులతో మెగా లెవల్లో విడుదలవుతున్న కొమరం పులి ఏం చేస్తాడో చూడాలి.
పవన్ కళ్యాణ్ పులి చిరంజీవి మగధీర రామ్ చరణ్ తేజ్ ఎస్ జె సూర్య నిఖీషా పటేల్ pawan kalyan puli chiranjeevi magadheera ram charan teja sj surya nikisha patel


Click it and Unblock the Notifications