twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శర్వానంద్ నా బిడ్డలాంటి వాడు.. రాంచరణ్ ఫోన్ చేసి.. శ్రీకారం ఫంక్షన్‌లో చిరంజీవి ఎమోషనల్

    |

    శ్రీకారం మూవీ వేడుకకు రావడం అనుకోకుండా జరిగింది. నా ఆచార్య సినిమా షూటింగ్ ఇక్కడే జరుగుతున్నది. దాంతో ఈ వేడుకకు రావడానికి వెసలుబాటు కలిగింది. నేను ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఈ వేదిక మీద ఉన్న మిత్రుడు, రవాణాశాఖ మంత్రి అజయ్ గారికి, శ్రీకారం యూనిట్ సభ్యులందరికీ, ఈ వేడుకను వీక్షిస్తున్న వారందరికి ధన్యవాదాలు. అన్నిరకాల సదుపాయాలు అందిస్తూ.. వారు సహకరించారు. అన్ని విధాల సహాయం అందించిన పోలీసు శాఖకు, అజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చిరంజీవి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..

     12 ఏళ్ల క్రితం అపూర్వ ఆదరణ

    12 ఏళ్ల క్రితం అపూర్వ ఆదరణ

    సరిగ్గా 12 ఏళ్ల క్రితం నేను ప్రజా అంకిత యాత్రకు చేస్తున్నప్పుడు నాపై చూపించిన ప్రేమను ఇప్పటికి మరిచి పోలేను. ఆ రోజు అర్ధరాత్రి దాటినా రోడ్డుకు ఇరువైపుల పెద్దలు, అన్నలు, అక్కలు, చెల్లెలు నాకు దారిపోడవునా స్వాగతం పలికారు. ఖమ్మంలో నాకు అపూర్వ ఆదరణ లభించిందనేది వాస్తవం. అది రికార్డులో కూడా ఉంది. ఖమ్మం ఆ వైపు నుంచి ఈ వైపు వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అది ఎప్పటికీ మరిచిపోలేనిది. ఖమ్మం పోరాటల ఖిల్లా. ఈ ప్రాంత ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను అని అన్నారు.

     రాంచరణ్ ఫోన్ చేసి

    రాంచరణ్ ఫోన్ చేసి

    నా కుమారుడు చరణ్ ఫోన్ చేసి శర్వానంద్ సినిమా వేడుక జరుగుతుంది. మీరు ముఖ్య అతిథిగా వెళ్లాలని చెప్పారు. నేను అప్పుడు ఖమ్మంలో ఉంటానని చెబితే.. వారే అక్కడికి వస్తారు అని చెప్పారు. అప్పుడు వారు అంత శ్రమ ఎందుకు తీసుకోవడం అన్నాను. కానీ వారు నా ప్రజెన్స్ వారికి ఆశీర్వాదంగా ఉంటుందని భావించి ఇక్కడి వచ్చారు అని చిరంజీవి అన్నారు.

    శర్వానంద్ నాకు బిడ్డలాంటివాడు

    శర్వానంద్ నాకు బిడ్డలాంటివాడు

    శ్రీకారం వేడుకకు రావడానికి ప్రధానం కారణం శర్వానంద్. మా ఇంట్లో శర్వ మా ఇంట్లో మరో రాంచరణ్ లాంటి వాడు. మా ఇంట్లోనే ఉండే వాడు. అలాంటి సమయంలో థమ్స్ అప్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఓ అబ్బాయి కావాల్సి వచ్చాడు. ఇంట్లో ఉన్న శర్వానంద్‌ను చూసి నీవు చేస్తావా అని అడిగితే చేస్తానని చెప్పాడు. దాంతో థమ్సప్ యాడ్ చేశాం అని చిరంజీవి గుర్తు చేసుకొన్నారు.

    నా సినిమాతోనే శ్రీకారం

    నా సినిమాతోనే శ్రీకారం

    ఆ తర్వాత నేను శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చేసేటప్పుడు ఓ పాత్రకు ఒకరు అవసరమయ్యారు. నాకు శర్వాలాంటి సాఫ్ట్ యాటిట్యూడ్ ఉన్న అబ్బాయి అయితే బాగుంటుందని అనుకొని ఆ పాత్రను చేయించారు. దాంతో శర్వానంద్‌ కెరీర్‌కు అక్కడే శ్రీకారం చుట్టబడింది అంటూ చిరంజీవి చెప్పారు

    English summary
    Actor Sharwanand's Sreekaram Pre Release Event is organised at Khammam Town. Megastar Chiranjeevi is the chief guest for the function. On this occassion, Fans welcomes grandly to Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X