twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏప్రిల్ 8 ఎంతో ప్రత్యేకం.. బోల్డంత అనుబంధం ఉంది ... సశేషం అంటూ ఉత్కంఠరేపిన మెగాస్టార్

    |

    మెగాస్టార్ చిరంజీవిని ఇన్ని రోజులు చూసింది ఒకెత్తు.. ఉగాది నుంచి చూస్తున్నది మరొ ఎత్తు. అంతకుముందు చిరంజీవి టైమింగ్‌ను, వ్యక్తిత్వాన్ని సినిమాల్లోనో, ఏదైనా ఈవెంట్‌లో ప్రసంగిస్తేనో చూసి ఉంటాం. అయితే ఉగాది నుంచి చిరులో మరో కోణం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎంటరైన చిరు.. ఎలా వాడాలో అలా వాడేస్తూ దున్నేస్తున్నాడు. కౌంటర్స్‌కు రివర్స్ కౌంటర్స్, మంచి పని చేస్తే అభినందనలు, ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నాడు. తాజాగా చిరు చేసిన ఓ ట్వీట్ ఎన్నో అనుమానాలతో పాటు ఉత్కంఠను రేకేత్తిస్తోంది. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

    వ్యక్తిగత విషయాలను సైతం..

    వ్యక్తిగత విషయాలను సైతం..

    చిరంజీవి సోషల్ మీడియాలో ఎంటరైన క్షణం నుంచి తెగ బిజీగా మారిపోయాడు. వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నాడు. కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగిస్తూ అభిమానులకు సూచనలు ఇస్తున్నాడు. ఈ క్వారంటైన్ సమయంలో తాను చేసే పనులను చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉదయాన్నే లేచి మొక్కలకు నీరు పడుతున్నానని చెబుతూ అందరిలోనూ స్ఫూర్తినింపుతున్నాడు.

    సినీ కార్మికులకు అండగా..

    సినీ కార్మికులకు అండగా..

    కరోనా వైరస్ విజృంభించడం, సినీ పరిశ్రమ మూత పడటం, షూటింగ్స్ లేకపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోవడంతో దిక్కు తోచని స్థితిలోకి వెళ్లారు. అలాంటి వారిని ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళాన్ని అందించిన చిరంజీవి.. కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి తోటీ హీరోలకు పిలుపునిచ్చాడు.

    అనుక్షణం పర్యవేక్షణ..


    సీసీసీ కార్యకలాపాలను అనుక్షణం పర్యవేక్షిస్తూ.. విరాళాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పసాగాడు. అంతేకాకుండా సీసీసీ మొదటి మెంబర్‌కు సాయం అందిందని, ఇక కొనసాగుతుందని సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించాడు. ఇలా ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గత పరుస్తున్నాడు. తాజాగా చిరు చేసిన ఓ ట్వీట్ ఎందరి మదిలోనో ఎన్నో అనుమానాలను రేకిత్తిస్తోంది.

    ఏప్రిల్ 8న బోలెడంత అనుబంధం..

    ఏప్రిల్ 8న బోలెడంత అనుబంధం..


    ఏప్రిల్ ఎనిమిదో తారీఖుతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెబుతూ.. ఇంకా చెబుతాను.. ఇప్పటికి ఇంతే అన్నట్టుగా సశేశం అంటూ ట్వీట్ చేశాడు. అయితే అలా ఎందుకు చేశాడు? ఏప్రిల్ 8తో ఉన్న అనుబంధం ఏంటని ఆరా తీయడం మొదలెట్టారు నెటిజన్స్.

    Recommended Video

    Buttabomma Video Song Crossed 100 Million Views | Viral In TikTok As well
    వారి పుట్టిన రోజులే కారణమా?

    వారి పుట్టిన రోజులే కారణమా?

    అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, అఖిల్ అక్కినేని పుట్టిన రోజులు ఏప్రిల్ 8న కావడమే ఆ ట్వీట్‌లో ఉన్న రహస్యమై ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు. బన్నీ అంటే చిరుకు ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అకీరా అంటే మరీ మక్కువ. ఇక అఖిల్ అయితే రామ్ చరణ్‌తో పాటే పెరిగాడని, తమకూ కుమారుడేనని బహిరంగంగా చెప్పిన సందర్భాలున్నాయి. మరి అసలు విషయం ఏంటో తెలియాలంటే.. చిరు చెప్పేవరకు చూడాలి.

    English summary
    Chiranjeevi Emotional Tweet About April 8th. Allu Arjun, Akira Nandan, Akhil Akkineni Birthday On April 8th. SO Chiru Gets Emotional.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X