For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiranjeevi బాస్‌ను కలిశా.. అన్నయ్య ఎప్పడూ స్పూర్తి ప్రదాత.. ప్రకాశ్ రాజ్ ఎమోషనల్!

  |

  మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ మధ్య వ్యక్తిగత, ప్రొఫెషనల్ అనుబంధం గుంచి కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రతీ విషయంలో ఒకరికొకరు తోడుగా ఉంటుంటారు. వారిద్దరి మధ్య అన్నదమ్ముల ఎమోషనల్ బంధం ఉంది. అందుకే చిరంజీవిని అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు. అంతేకాకుండా బాస్ అంటూ ప్రేమగా పిలచుకొంటారు. ఇటీవల మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌కు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో వారిద్దరి మధ్య విడదీయలేని బంధం ఏమిటో అర్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కలుసుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  ప్రకాశ్ రాజ్‌కు అండగా చిరంజీవి

  ప్రకాశ్ రాజ్‌కు అండగా చిరంజీవి

  నటుడు ప్రకాశ్ రాజ్ గత కొద్దినెలలుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగనుండటంతో అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ప్యానెల్‌ను సిద్ధం చేశారు. ఈ ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రకాశ్ రాజ్‌కు చిరంజీవి, ఆయన సోదరులు మద్దతు తెలియజేయడంతో అందరి దృష్టి పడింది. అయితే ప్రకాశ్ రాజ్ లోకల్ కాదు.. నాన్ లోకల్ అంటూ వివాదం సృష్టించబోగా మెగా బ్రదర్స్ అండగా నిలిచారు.

   ఏపీ సర్కార్‌తో భేటీకి ముందు

  ఏపీ సర్కార్‌తో భేటీకి ముందు

  రెండు లాక్‌డౌన్లతో తెలుగు సినీ పరిశ్రమ అనేక సమస్యల్లో కూరుకుపోయింది. ముఖ్యంగా ఏపీలో థియేటర్ల ఓపెనింగ్ ఓ సమస్య అయితే.. టికెట్ల రేట్లు పెంపు మరో వివాదంగా మారింది. పలువురు నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచుకోనేందుకు ప్రయత్నం చేసుకోగా ఏపీ సర్కార్ అడ్డుకొన్నది. థియేటర్లలో టికెట్ల రేట్ల పెంపుపై ఆంక్షలు విధించింది. అయితే భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం ప్రతికూలంగా మారడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు సినీ ప్రముఖులంతా చిరంజీవి నేతృత్వంలో సోమవారం సమావేశమయ్యారు.

   వైఎస్ జగన్‌తో చర్చించేందుకు

  వైఎస్ జగన్‌తో చర్చించేందుకు

  మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సోమవారం (ఆగస్టు 16వ తేదీన) జరిగిన ఈ కార్యక్రమంలో ఫిలిం చాంబ‌ర్ అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్, నాగార్జున అక్కినేని, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్ నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్ రామారావు, దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్, సి కళ్యాణ్, ఎన్వీ ప్రసాద్, కొరటాల శివ, వివి వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ, భోగవల్లి బాబీ, యూవీ క్రియేషన్స్ విక్కీ, వంశీతోపాటు.నిర్మాత‌ల సంఘం. పంపిణీ, ఎగ్జిబిష‌న్ రంగాల నుంచి ప్ర‌తినిధులు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు. ఇటీవ‌ల ఏపీలో వ‌చ్చిన జీవోలో ఉన్న‌వాటిపై చ‌ర్చించారు. సీఎంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాలేమిటి? అన్న‌దానిపై చ‌ర్చించారు. అన్నిటికీ త్వరగా ప‌రిష్క‌రించాల‌న్న‌ది ప్ర‌ధాన డిమాండ్. చిన్న నిర్మాత‌ల స‌మ‌స్య‌ల‌పైనా సీఎంతో భేటీలో చ‌ర్చించ‌నున్నారు.

  చేతికట్టుతో ప్రకాశ్ రాజ్

  చేతికట్టుతో ప్రకాశ్ రాజ్

  చిరంజీవి నేతృత్వంలో జరిగిన సమావేశం అనంతరం మంగళవారం ఉదయం చిరంజీవిని చేతి కట్టుతో ప్రకాశ్ రాజ్ కలిశారు. ఇటీవల ప్రకాశ్ రాజ్ ధనుష్ మూవీ షూటింగులో ప్రమాదానికి గురై చేతికి శస్త్ర చికిత్స చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరు దిగిన ఫోటోను ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయగా వైరల్ అయింది. సినీ ప్రపంచానికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి వెళితే.. ఆయన స్పందించిన తీరు అద్భుతం అంటూ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుం ట్విట్టర్‌లో ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి భారీగా మంచి రెస్పాన్స్ వస్తున్నది.

  MAA Election : Jeevita Rajasekhar Vs Prakash Raj Vs Manchu Vishnu| Triangular Fight|Filmibeat Telugu
  బాస్ చిరంజీవిని కలిశాను అంటూ..

  బాస్ చిరంజీవిని కలిశాను అంటూ..

  ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేస్తూ ఈ ఉదయమే బాస్‌ను జిమ్‌లో కలిశాను. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ఆయన తీసుకొన్న చొరవను స్పూర్తిగా తీసుకొని ఆయన నేను థ్యాంక్స్ చెప్పాను. అన్నయ్య మీరు ఎప్పుడూ నాకు స్పూర్తిని కలిగిస్తూనే ఉంటారు. ఆయనలాంటి గొప్ప వ్యక్తితో అనుబంధం ఉండటం మనమంతా వరంగా భావించాలి అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

  English summary
  Actor Prakash Raj met Mega star chiranjeevi on August 17th. He tweeted that, Early morning meeting with the BOSS in the gym. Thanked him for taking the initiative to find solutions for the film fraternity .. an ever inspiring ANNAYA.. we are blessed to have him
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X